కోమటిచెరువు అభివృద్దికి ప్రత్యేకచర్యలు

లక్నవరం తరహాలో వేలాడే వంతెన ఏర్పాటు
కాళేశ్వరం నీటి తరలింపుతో మరింత శోభ
అధికారులతో సవిూక్షించిన ఎమ్మెల్యే హరీష్‌ రావు
సిద్దిపేట,జూన్‌7(జ‌నంసాక్షి): సిద్దిపేట కోమటి చెరువును పర్యాటకంగా అభివృద్ది చేసే క్రమంలో  లక్నవరం సరస్సులో ఉన్న తరహాలో సస్పెన్షన్‌ బ్రిడ్జ్‌ ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే హరీష్‌ రావు తెలిపారు. దీంతో చెరువులో అందాలను నేరుగా వీక్షించే అవకావం ఉంటుందని అన్నారు. రాష్ట్రానికే  రోల్‌ మోడెల్‌గా, పర్యాటక ప్రాంతంగా నిలుస్తున్న సిద్దిపేట కోమటి చెరువును ఎమ్మెల్యే శుక్రవారం  పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ లక్నవరంలో ఉన్న మాదిరిగా, అదే తరహాలో కోమటి చెరువుపై వ్రేలాడే వంతెన ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కోమటి చెరువుపై ఇటీవలే జిప్‌ సైక్లింగ్‌, ఇతర సాహస క్రీడలు ఇప్పటికే ఏర్పాటు చేసుకున్నాం అని.. కొద్దీ రోజుల్లోనే కోమటి చెరువుకి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్లు రాబోతున్నాయన్నారు. కోమటి చెరువుని ప్రముఖ పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దే విధంగా చర్యలు చేపడతామన్నారు. కోమటి చెరువుపై ఎక్కడ ఏర్పాటు చేయాలనే విషయంపై ఇరిగేషన్‌, టూరిజం, మున్సిపల్‌ అధికారులకు సూచించారు. వెంటనే పనులు ప్రారంభించి వచ్చే రెండు మూడు నెలల్లో పనులు పూర్తి చేసీ అందుబాటులోకి తేస్తామన్నారు. ఇప్పటికే చెరువు వద్దకు పర్యాటకుల సంఖ్య పెరిగింది. నిత్యం సాయంత్రం వేళల్లో ఇక్కడికి ప్రజలు భారీగా తరలి వచ్చిసేదతీరుతున్నారు. పిల్లలు ఆడుకునేందుకు ఈ ప్‌ఆరంతాన్‌ఇన  బాగా ఉపయోగించుకుంటున్నారు. ఈ ప్రాంతం అభివృద్ది కావడం తమ అదృష్టమని పలువురు ప్రస్తావించారు. దీతంఓ మరింత అభివృద్ది సంతరించుకోనున్న తరుణంలో హరీస్‌ రావు సవిూక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ రాజనర్సు, కాళేశ్వరం ప్రాజెక్టు పర్యవేక్షణ అధికారి ఆనంద్‌, ఈఈ రవీందర్‌ రెడ్డి, టూరిజం డీఈ సుధాకర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌ రెడ్డి, ఇరిగేషన్‌ ఏఈ విష్ణు, మున్సిపల్‌ డీఈ లక్ష్మన్‌ పాల సాయిరాం, బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు.
పేదబ్రాహ్మణులకు ఉపాధి అవకాశాలు పెరగాలి
పేద బ్రాహ్మణులకు ఉపాధి అవకాశాలు పెంచాలని ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు. సిద్దిపేట బ్రాహ్మణ పరిషత్‌ను నేడు మాజీ మంత్రి హరీష్‌రావు, రాష్ట్ర బ్రాహ్మణ పరిషత్‌ చైర్మన్‌ కేవీ రమణాచారి, మృత్యుంజయశర్మ, అష్టకాల రామ్మోహన్‌రావు, రంగు హరిహరరావు సందర్శించారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ.. సిద్దిపేట బ్రాహ్మణ పరిషత్‌ను అధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దాలన్నారు. బ్రాహ్మణ పరిషత్‌ను విజ్ఞాన కేంద్రంగా మార్చాలన్నారు. పేద బ్రాహ్మణ మహిళల కోసం సహకార సొసైటీని ఏర్పాటు చేయాలన్నారు. సీఎం కేసీఆర్‌ దేశంలోనే మొట్టమొదటి బ్రాహ్మణ పరిషత్‌ను సిద్దిపేటలో నిర్మించారన్నారు. ఈ బ్రాహ్మణ పరిషత్‌ను రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన పరిషత్‌గా తీర్చిదిద్దాలని హరీష్‌రావు పేర్కొన్నారు.