కోయగూడెం పిట్-3 ప్రైవేటీకరణను అడ్డుకుంటాం –ఐఎఫ్ టీ యు
టేకులపల్లి, సెప్టెంబర్ 1(జనం సాక్షి) : కార్మిక ప్రజాసంఘాలను ఏకం చేసి కోయగూడెం ఫిట్- 3 ప్రైవేటీకరణను అడ్డుకుంటామని ఐఎఫ్టియు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు డి ప్రసాద్, షేక్ యాకుబ్ షావలిలు హెచ్చరించారు .టేకులపల్లి మండలంలో ని ఆంజనేయపాలెంలో గురువారం భారత కార్మిక సoఘాలసమైక్య (ఇఫ్టు)జిల్లాకమిటీ సమావేశంజరిగింది. ఈ సమావేశంలో వారు మాట్లా డుతూ కోయగూడెం ఫిట్- 3ని కేంద్ర ప్రభుత్వం ఆరో కోల్ కంపెనీకి కేటాయించితే కార్మికసంఘాలను, ప్రజాసంఘాలను, ప్రజాస్వామిక వాదులను ఏకంచేసుకొ ని బలమైనకార్మిక ప్రజా ఉద్యమాలను నిర్వహించి టెండర్ రద్దుఅయ్యేంత వరకు పోరాడుతామన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థలను బడాపెట్టుబడిదారులకు కార్పొరేటర్లకు అప్పనం గా కట్టబెట్టుతుందని, ఇది దేశ కార్మిక వర్గాన్ని రోడ్డుమీద పడేసే ధోరణి అన్నారు. బడాకార్పొరే ట్ల ప్రయోజనాల కోసమే 44 చట్టాలను నాలుగు కోడులుగా తెచ్చారని ఇది దేశ కార్మిక వర్గానికి తీవ్రమైననష్టమని అన్నారు. కోయగూడెం పిట్-3 ని సింగరేణికి కేటాయించాలని ఇఫ్టూ జిల్లా కమిటీ డిమాండ్ చేస్తుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రజలు ప్రజాస్వామ్యవాదులు, కార్మిక సంఘాలు ఉద్యమించాలనిపిలుపు నిచ్చారు. సెప్టెంబర్ 9 నుండి కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో జరిగే సింగరేణి కాంట్రాక్ట్ కార్మి కులు తలపెట్టిన నిరవదిక సమ్మెను ఐఎఫ్టియు బల పరుస్తుందని అన్నారు. ఈసమ్మెలోకాంట్రాక్టు కార్మికులందరూ పాల్గొని తమవేతనాలను, హ క్కులను,సౌకర్యాలను సాధించుకోవాలని పిలు పునిచ్చారు. రాష్ట్రంలో వీఆర్ఏల సమస్యలను తదితర కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని ఇఫ్టు డిమాండ్ చేసిందని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు మధుసూదన్ �