కోరుట్లలో షాపంగ్ మాల్‌లో అగ్నిప్రమాదం
భారీగా ఆస్తినష్టం జరిగినట్లు అంచనా
జగిత్యాల,ఆగస్ట్18(జనంసాక్షి): జగిత్యాల జిల్లా కోరుట్లలోని ఆనంద్ షాపింగ్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బుధవారం తెల్లవారు జామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని దాదాపు రెండు గంటలుగా మంటలు ఆర్పారు. షాపింగ్ మాల్ నాలుగు అంతస్తుల్లో మంటలు చెలరేగాయి. అగ్ని ప్రమాదానికి కారణాలు మాత్రం తెలియరాలేదు. అయితే, షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ప్రమాదంలో భారీ ఎత్తున ఆర్థికంగా నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.