కోరుట్ల పీఎస్‌ ముందు టీఆర్‌ఎస్‌ ఎమ్మోల్యే ఆందోళన

కరీంనగర్‌: తెలంగాణ వాదుల అక్రమ అరెస్టులను నిరసిస్తూ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు కోరుట్ల పోలీసు స్టేషన్‌ ముందు ఆందోళన చేస్తున్నారు. వైఎస్‌ విజయమ్మ దీక్ష కోసం జిల్లాలో టీఆర్‌ఎస్‌ పార్టీ నేతలను. కార్యకర్తలను పోలీసులు అక్రమంగా ఆదుపులోకి తీసుకోవడంపై విద్యాసాగర్‌రావు మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ఉంటుదని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికైన వైఎస్‌ఆర్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు సిరిసిల్ల రావడం మానుకోవాలని ఆయన సూచించారు. రేపు సిరిసిల్లలో అనుకోని సంఘటనలు జరిగితే అందుకు విజయమ్మ కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు.

తాజావార్తలు