కోలుకుంటున్న కృష్ణానాయక్‌

ఓల్డ్‌ మలక్‌పేట, హైదరాబాద్‌ : ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బాష్పవాయు గోళం తగిలి స్వల్పంగా గాయపడిన బానోతు కృష్ణానాయక్‌ (28) యశోదా ఆస్పత్రిలో డాక్టర్‌ మహేందర్‌రెడ్డి పర్యవేక్షణలో కోలుకుంటున్నాడు. ఆయన కేం ప్రమాదం లేదని,ముందుజాగ్రత్త కోసం పర్యవేక్షణలో ఉంచామని వైద్యులు తెలిపారు. వరంగల్‌ జిల్లా చౌకుల తండాకు చెందిన కృష్ణ హైదరాబాద్‌లో ఎంఏ చదువుతున్నాడు.