కోల్‌కతా ఘటనపై దేశవ్యాప్తంగా వైద్యుల ఆందోళన

విధులు బహిష్కరించి నిరసనలు..ధర్నాలు
కేవలం ఎమర్జెన్సీ కేసులు మాత్రమే హాజరు
న్యూఢల్లీి,ఆగస్ట్‌17  (జనం సాక్షి):  కోల్‌కతాలో జూనియర్‌ డాక్టర్‌పై హత్యాచారం ఘటన దేశ వ్యాప్తంగా కాకరేపుతోంది. కోల్‌కతాలో జరిగిన ఘటనపై దేశంలో వైద్యులంతా ఏకతాటిపైకి వచ్చారు. గతంలో ఏవైనా ఘటనలు జరిగేటప్పుడు స్వరాష్ట్రంలో మాత్రమే నిరసనలు జరిగేవి. తీవ్రత ఆధారంగా దేశ వ్యాప్తంగా నిరసన గళం వినిపించేది. ప్రస్తుతం కోల్‌కతా ఘటనపై ప్రతి ఒక్కరూ న్యాయం కోసం నినదిస్తున్నారు. దేశంలో వైద్యులంతా ఐక్యమై రోడ్డెక్కారు. ముందు తమ ప్రాణాలకు రక్షణ కల్పిస్తే.. తాము రోగుల ప్రాణాలు కాపాడతామంటూ వైద్యులు నినదిస్తున్నారు. మరోవైపు పార్టీలకు అతీతంగా అన్ని రాజకీయ పక్షాలు వైద్య విద్యార్థినికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తున్నాయి. ఓవైపు సీబీఐ విచారణ కొనసాగుతుండగా.. త్వరగా విచారణ పూర్తిచేసి..నిందితులను కఠినంగా శిక్షించాలంటూ పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ సైతం నిరసనల్లో పాల్గొన్నారు. మమతా బెనర్జీ రాజీనామా చేయాలని పశ్చిమబెంగాల్‌ బీజేపీ నేతలు డిమాండ్‌ చేస్తున్నారు.మరోవైపు ఈ ఘటనలో నిందితులందరిని తక్షణమే అరెస్ట్‌ చేయాలనే డిమాండ్‌ వినిపిస్తోంది. జూనియర్‌ డాక్టర్‌పై హత్యాచారం కేసులో ఆసుపత్రిలోని కొందరు వైద్యులు, సిబ్బంది పాత్ర ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కోల్‌కతాలో జూనియర్‌ డాక్టర్‌ ఘటనపై తెలుగు రాష్టాల్లో వైద్యులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. కోల్‌కతాలో జూనియర్‌ డాక్టర్‌ అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనను నిరసిస్తూ ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ), ఫ్యాకల్టీ అసోసియేషన్‌ ఆఫ్‌ ఆల్‌ ఇండియా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ దేశశ్యాప్తంగా నిరసనకు పిలుపునిచ్చింది. దేశవ్యాప్తంగా శనివారం 24 గంటలపాటు వైద్య సేవల బంద్‌ చేయాలని నిర్ణయించాయి వైద్య సంఘాలు. అత్యవసర సేవలు మినహా అన్ని ఆరోగ్య సేవలు, సాధారణ సేవలు శస్త్రచికిత్సలు శనివారంఉదయం 6 నుండి ఆదివారం ఉదయం 6 గంటల వరకు నిలిపివేస్తున్నట్లు
తెలిపింది. డాక్టర్లు కేవలం ఎమర్జెన్సీ కేసులను మాత్రమే అటెండ్‌ అవ్వాలని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ వెల్లడిరచింది. ఐఎంఏ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా వైద్యుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఓపీ సేవలు నిలిచిపోయాయి. ఈ సమ్మెకు దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్‌ వైద్యులు, మెడికల్‌ సిబ్బంది సైతం తమ సంఫీుభావం ప్రకటించి ఓపీ సేవలను నిలిపివేశారు.ఈ క్రమంలో ఓపీ సేవలు నిలిచిపోవటంతో దేశవ్యాప్తంగా రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నిరసన ద్వారా వైద్యులు పలు డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచుతున్నారు.వైద్యులకు కేంద్ర రక్షణ చట్టం అమలు చేయాలని, కోల్‌కతాలోని ఆర్జీ కర్‌ మెడికల్‌ కాలేజీలో బాధితురాలికి తక్షణ న్యాయం జరగాలని డిమాండ్‌ చేస్తున్నారు.సెక్యూరిటీ ఆడిట్‌, సెక్యూరిటీ సిబ్బంది వెంటనే అందుబాటులో ఉండేలా చూడాలని, ఆసుపత్రిలో అమర్చిన కెమెరాల పూర్తి నివేదిక ఇవ్వాలని డాక్టర్లు డిమాండ్‌ చేస్తున్నారు. సాధారణంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు తమ సమస్యల పరిష్కారం కోసం వైద్య సేవలను నిలిపివేస్తుంటారు. కానీ కోల్‌కతా ఘటనపై ప్రయివేట్‌ ఆసుపత్రుల వైద్యులు 24 గంటల పాటు ఓపీ సేవలను నిలిపివేశారు. శనివారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం ఆరు గంటల వరకు తెలంగాణలో అన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో ఓపీ సేవలు నిలిచిపోతాయని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ) ప్రకటించింది. అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు నిర్వహిస్తోంది. కోల్‌కతా ఘటన అత్యంత హేయమని, బాధ్యులను ఇప్పటిరవకు గుర్తించకపోవడం, వైద్యులకు తగిన భద్రత, రక్షణ లేకపోవడం అన్యాయమని ఐఎంఏ నాయకులు తెలిపారు. ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో అత్యవసర సేవలు మాత్రమే అందుబాటులో ఉంటాయన్నారు. హైదరాబాద్‌ ఇందిరాపార్క్‌లోని ధర్నాచౌక్‌లో ఐఎంఏ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. తెలంగాణ వ్యాప్తంగా పలు పట్టణాల్లో వైద్యులు, వైద్య సిబ్బంది నిరసన ప్రదర్శనలు చేశారు. కోల్‌కతా ఘటనపై సీబీఐ విచారణను వేగవంతం చేసి నిందితులందరినీ అరెస్ట్‌ చేయాలని వైద్య సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఐఎంఏ పిలుపుతో శనివారం ఉదయం 6గంటల నుంచి ఆదివారం ఉదయం ఆరు గంటల వరకు ఓపీ సేవలను నిలిపి వేస్తున్నట్లు రాష్ట్రంలోని ప్రధాన కార్పొరేట్‌ ఆసుపత్రులు ప్రకటించాయి. అపోలో, కిమ్స్‌, స్టార్‌, యశోద, రెయిన్‌బో, కిమ్స్‌`సన్గ్‌ªన్‌ ఆసుపత్రులు సహా వివిధ ఆసుపత్రుల్లో 24 గంటలపాటు ఓపీ ఉండబోదని, ఎమ్జ్గంªన్సీ సేవలు అందిస్తామని వెల్లడిరచాయి.