కోళ్ల పెంపకం ద్వారా ఆర్థికాభివృద్ధి

సంగారెడ్డి, నవంబర్‌ 9 (: నిరుపేదల ఉన్నతి కోసం పెరటి రాజశ్రీ కోళ్ల పెంపకం ద్వారా ఆర్థికాభివృద్ధి పొందవచ్చునని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖమంత్రి సునితారెడ్డి అన్నారు. శుక్రవారం నర్సాపూర్‌లో నియోజకవర్గం లబ్ధిదారులకు రాజశ్రీ కోళ్ల పంపిణీ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాజశ్రీ కోళ్ల పెంపకం ద్వారా నిరుపేదల సమగ్రాభివృద్ధి పొందవచ్చునని తెలిపారు. ఒక్కోక్క రాజశ్రీ కోడికి ప్రభుత్వం రూ.45లు చెల్లిస్తుందని తెలిపారు. లబ్ధిదారులు ఐదు రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. నియోజకవర్గంలోని నర్సాపూర్‌, శివ్వంపేట, కొల్చారం మండలాల లబ్ధిదారులకు రాజశ్రీ కోళ్లను అందజేశారు.

తాజావార్తలు