కోహిర్ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు
సంగారెడ్డి,అగస్టు16(ఆర్‌ఎన్‌ఎ): కోహిర్ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. సోమవారం దాడులు నిర్వహించిన అధికారులు భూములకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న అధికారులు రికార్డులు తారుమారు చేయడంతోపాటు రైతుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపణలు రావడంతో తనిఖీలు చేస్తున్నట్టు సమాచారం. తహసీల్దార్ ధరణి పట్టాదారు పాసు పుస్తకాలు లేకుండానే రిజిస్టేష్రన్ చేశారని కొందరు రైతులు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. దీంతోపాటు తహసీల్దార్, నాయబ్ తాసిల్దార్ భూములకు సంబంధించిన పలు రికార్డులు మార్పులు చేర్పులు చేయడంతో రైతులు ఏసీబీ అధికారులను ఆశ్రయించినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.