కోహ్లీ ఖాతాలో మరో రికార్డు!
టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు చేరింది. విండీస్ తో జరిగిన సెమీ ఫైనల్లో సూపర్ఇన్నింగ్స్ఆడిన కోహ్లీ 16వ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ట్వంటీ ట్వంటీల్లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన ప్లేయర్గా రికార్డు క్రియేట్చేశాడు. ఇంతకుముందు ఈ రికార్డు క్రిస్ గేల్, బ్రెండన్ మెక్కల్లమ్ పేరిట ఉండేది. వీరిద్దరూ టీ ట్వంటీల్లో 15 హాఫ్ సెంచరీలు సాధించారు.