కౌలు రైతులకు రుణాలు ఎందుకివ్వడం లేదు ?

శ్రీవ్యవసాయ రుణాలకు ప్రాధాన్యం ఇవ్వండి
శ్రీచేనేత రుణాలు మాఫీ చేయండి
శ్రీకిసాన్‌ క్రెడిట్‌ కార్డులను ప్రోత్సహించండి
శ్రీబ్యాంకర్లకు సీఎం హుకుం
హైదరాబాద్‌, ఫిబ్రవరి 2 (జనంసాక్షి):
వ్యవసాయ రుణాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి బ్యాంకర్లను ఆదేశించారు. వ్యసాయంతో పాటు వ్యవసాయ అనుబంధ రంగాలకు ఇచ్చే రుణాలను పెంచాలని సూచించారు. కౌలు రైతులకు కూడా రుణాలు ఇవ్వడంలో బ్యాంకులు వెనకుబడ్డాయని అసహనం వ్యక్తం చేసిన సీఎం కిరణ్‌.. కౌలు రైతులకు రుణాలు ఇవ్వడంలో ఆసక్తి చూపాలన్నారు. రైతులకు, మహిళలకు అవసరమైన రుణాలు ఇచ్చేందుకు ముందుకు రావాలని, రాష్ట్రంలో కిసాన్‌ క్రెడిట్‌ కార్డుల సంఖ్యను పెంచాలని సూచించారు. శనివారం జూబ్లీహాల్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో సీఎం కిరణ్‌.. రాష్ట్ర వార్షిక రుణ ప్రణాళిక ప్రగతిపై సవిూక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహా, మంత్రులు ఆనం రాంనారయణరెడ్డి, రఘువీరారెడ్డి, కాసు వెంకటకృష్ణారెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సమావేశంలో విద్యారుణాల, చిన్న మధ్య, సూక్షస్థాయి సంస్థలకు రుణసౌకర్యం, సవరించిన నిబంధనలు, చేనేత రంగ సంస్కరణలు, పునరుద్దరణ, జౌళి పరిశ్రమకు పునరావాస ప్యాకేఏజీ, ఎస్సీ,ఎస్టీలు, మహిళలు, వెనుకబడిన తరగతులకు రుణసౌకర్యం వంటి అంశాలపై
చర్చించారు. గ్రావిూణ బ్యాంకుల పనితీరు, గృహనిర్మాణ రంగానికి ఆర్థిక సాయం, కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు తదితర అంశాలపైనా చర్చ జరిగింది. ముఖ్యమంత్రి కిరణ్‌ మాట్లాడుతూ.. బ్యాంకుల జాతీయీకరణ తర్వాత పేదలకు పెద్ద ఎత్తున రుణాలు అందించడం జరుగుతోందన్నారు.
వ్యవసాయ రుణాలకు పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం సూచించారు. వ్యవసాయంతో పాటు వ్యవసాయ ఆధారిత రంగాలకు ప్రోత్సాహం కల్పించాలని బ్యాంకర్లను ఆదేశించారు. ఇందులో భాగగంఆ పాడి, ఫిషరీస్‌ , కోళ్ల పరిశ్రమ, ఉద్యానవనాలకు ప్రాధానయం ఇవ్వాలన్నారు. పాలదిగుబడి పెరుగుతోందని, కొన్ని అవాంతరాలు ఉన్నా రాష్ట్రంలో ఈ రంగం పురోభివృదద్‌ఇలో ఉందన్నారు. ఈ రంగంలో ఉన్నవారికి పెద్ద ఎత్తున రుణాలిచ్చి ఆదుకోవాల్సి ఉందన్నారు. ఫిషరీస్‌ను కూడా ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని అన్నారు. దాదాపు 260 కోట్లు వారి కోసం వెచ్చిస్తోందన్నారు. అయితే వారు దాదాపు 11వేల కోట్ల వ్యాపారం చేస్తున్నారని చెప్పారు. వారికి ఎంతగా రుణమిస్తే అంతగా ముందుకు వెళ్లే అవకాశం ఉందన్నారు. జలయజ్‌ఒం ద్వారా ఇప్పటికే 20 లక్షల ఎకరాలను సాగులోకి తెచ్చామని, రానున్న కాలంలో మరో 30 లక్షల ఎకరాలు సాగులోకి రాగలవన్నారు. దీంతో వ్యవసాయ రంగం పెద్ద ఎత్తున ముందుకు తసీఉక వెళుతున్నామన్నారు.రైతుల నుంచి ప్రభుత్వమే ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందని ప్రకటించడంతో ధాన్యానికి మంచి గిట్టుబాట ధర వచ్చిందని తెలిపారు. ఇటీవల ప్రవేశ పెట్టిన మనబియ్యం పథకం ఏడు జిల్లాలో అమలు చేస్తున్నామన్నారు. ఎక్కడి ధాన్యం అక్కడే కొనుగోలు చేసి పంపిణీ చేసేందుకు కార్యాచరణ చేట్టామని సిఎం అన్నారు. సన్న ధాన్యానికి 1180 మద్దతు ధర ప్రకటించడంతో ఇప్పుడు వ్యాపారులు పోటీపడి 1800 కోనుగోలు చేసేందుకు ముందుకు వచ్చారని అన్నారు. ఇదో రకంగా రైతులకు మేలు జరిగిందన్నారు. అయితే ధాన్యం నిల్వలకు గోదాముల సమస్య ఉందన్నారు.రాష్ట్రంలో ధాన్యాన్ని నిల్వ చేసేందుకు మరిన్ని గోదాములను నిర్మిస్తామని తెలిపారు. ఇందుకు బ్యాంకర్లు ముందుకు రావాలన్నారు. ఉద్యాన పంటల ప్రోత్సాహానికి మరిన్ని నిధులు కేటాయిస్తున్నామని వెల్లడించారు. కౌలు రైతులకు పంట రుణాలు ఇచ్చేందుకు ఆసక్తి చూపాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా అందజేసే రుణాలు చాలా తక్కువగా ఉన్నాయని, వాటిని పెంచాలని ఆదేశించారు. రాష్ట్రంలో పాల ఉత్పత్తి తగ్గడంపై కిరణ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. పాడి పరిశ్రమను అభివృద్ధి చేయాల్సిన ఉందని తెలిపారు. ఇందిరాకాంతి పథకం ద్వారా మహిళలకు రుణాలు ఇస్తున్నామని, అయితే, ఆశించిన స్థాయిలో బ్యాంకులు రుణాలు ఇవ్వడంలో వెనకబడ్డాయన్నారు. కేంద్ర ప్రభుత్వం మహిళలకు ప్రత్యేక బ్యాంకు పెట్టాలనే యోచిస్తోందని వెల్లడించారు. గ్రావిూణ, గిరిజన ప్రాంతాల్లో బ్యాంకర్లు తమ బ్రాంచిలను ప్రాంభించాలని స్పష్టం చేశారు. కిసాన్‌ క్రెడిట్‌ కార్డుల సంఖ్య పెంచాలన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు మరింత ప్రోత్సాహం అందించాలని సూచించారు. పాడి పరిశ్రమ, కోళ్ల పరిశ్రమను ఆదుకుంటామని ముఖ్యమంత్రి హావిూ ఇచ్చారు. చేపలు, రొయ్యల చెరువల రైతులకు డీజిల్‌ రాయితీ అందిస్తున్నామని చెప్పారు. సహకార బ్యాంకుల్లో గతేడాది రూ. 80 కోట్ల రుణాలు మాఫీ అయ్యాయన్నారు. చేనేత సంఘాల రుణాలను త్వరగా మాఫీ చేయాలని ఆదేశించారు. ఆప్కో ద్వారా చేనేత ఉత్పత్తులు కొనుగోలు చేస్తామన్నారు. రుణ సౌకర్యాలు మెరుగుపరచడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. జలయజ్ఞం ద్వారా అదనంగా 20 లక్షల ఎకరాలకు నీరు అందిస్తున్నామని సీఎం అన్నారు. త్వరలో మరో 30 లక్షల ఎకరాలకు నీరు అందించనున్నట్లు చెప్పారు. గతేడాది రైతులకు రూ.1800 కోట్ల మేర సబ్సిడీ ఇచ్చామని వివరించారు. వికలాంగ రుణాల్లో కొంత వెనుకబడి ఉన్నామని వారికి తప్పకుండా రుణాలు ఇవ్వాలన్నారు. వారికి రుణాలిస్తే చెల్లించరనే అపోహ నుంచి బయటపడాలన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ అమలులో భాగంగా వారికి వ్యక్తిగత రుణాలను కూడా పెంచాలన్నారు.