క్యాట్‌ – 2012 ఫలితాల్లో ఇంజినీర్లదే పై చేయి

ముంబయి: ప్రతిష్ఠాత్మక ఐఐఎంలలో ప్రవేశానకి నిర్వహించే క్యాట్‌ పరీక్ష ఫలితాల్లో ఈసారీ ఇంజినీర్లే ప్రతిభ చాటారు. నిన్న విడుదలైన ఈ ఫలితాల్లో మొదటి పదిర్యాంకులు పొందిన అభ్యర్థులకు నూటికి నూరుశాతం మార్కులు లభించాయి. వారిలో తొమ్మిది మంది ఇంజినీరింగ్‌ చదివినవారే. 8 మంది ఐఐటీలలో చదివినవారే కాగా ఇద్దరు ముంబయి ఐఐటీకి చెందినవారు. ఈ ఫలితాల్లో ఈసారి ముంబయి విద్యార్థులు అధికసంఖ్యలో ప్రతిభ చూపడం విశేషం. ముంబయి నుంచి17,000 మంది, ఢీల్లీ నుంచి 21,224 మంది, బెంగళూరు నుంచి 19,553 మంది పరీక్ష రాశారు. వీరిలో ముంబయికి చెందిన 180 మంది 99 శాతం, ఆ పైన మార్కులు సంపాదించిన వారిలో ఉన్నారు. ఢిల్లీకి చెందినవారు 168 మంది, బెంగళూరు అభ్యర్థులు 157 మంది 99 ప్లన్‌ కేటగిరిలో ఉన్నారు. ఈ ఏడాది 19 మంది అభ్యర్థులు 99.99 శాతం మార్కులు సాధించగా, 99-100 శాతం మధ్యలో మార్కులు సాధించినవారు 1895 మంది ఉన్నారు.