క్రీడలతో ఉజ్వల భవిష్యత్తు

 జిల్లాకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలి
• క్రీడాకారులకు క్రీడా దుస్తుల పంపిణీ
• కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్: ఎడ్మ సత్యం
నాగర్ కర్నూల్ జిల్లా బ్యూరో ఆగస్ట్ 22 జనంసాక్షి: క్రీడలతోనే ఉజ్వల భవిష్యత్తు సాధ్యమని, క్రీడాకారులు నిరంతరం సాధన చేసి ఉన్నత శిఖరాలను చేరుకోవాలని కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం అన్నారు.ఈనెల 24,25 తేదీలలో మెదక్ జిల్లాలో నిర్వహించే రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొనబోయే నాగర్ కర్నూల్ జిల్లా జట్టు క్రీడాకారులకు ఆదివారం కల్వకుర్తి పట్టణంలోని స్థానిక మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాల/కళాశాల మైదానంలో స్టేడియంలో  అథ్లెటిక్స్ అసోసియేషన్ సభ్యులతో కలిసి ఎడ్మ కిష్టారెడ్డి మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రీడా దుస్తులను పంపిణీ చేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లా క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీల్లో అత్యంత ప్రతిభ కనబరిచిపతకాల పట్టికలో జిల్లా పేరును ముందంజలో ఉంచాలని ఆయన సూచించారు.తెలంగాణ ప్రభుత్వం క్రీడాభివృద్ధికి ఎంతో కృషి చేస్తుందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.క్రీడాకారులు నిరంతరం పట్టుదలతో సాధన చేసి ఉత్తమ ఫలితాలు సాధించాలని కోరారు. చదువుతోపాటు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని తెలిపారు.క్రీడాకారులకు క్రీడా దుస్తులు అందజేయడం పట్ల అసోసియేషన్ కార్యదర్శి సోల పోగుల స్వాములు,సభ్యులు కిష్టారెడ్డి ఫౌండేషన్ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో విండో చైర్మన్ జనార్దన్ రెడ్డి,మాధవరెడ్డి, ఖాదర్,సురేష్ అథ్లెటిక్స్ అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి పసుపుల పరశురాముడు, కోశాధికారిఎడ్మ శ్రీను యాదవ్,అసోసియేషన్ సభ్యులు లక్ష్మీ, విజయ్,తదితరులు పాల్గొన్నారు.