క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి: కలెక్టర్ వల్లూరి క్రాంతి

జోగులాంబ గద్వాల బ్యూరో (జనంసాక్షి) ఆగస్టు 20 :క్రీడలు దేహదారుఢ్యానికి, మానసిక ఉల్లాసానికి, ఆరోగ్య పరిరక్షణకు దోహదపడతాయని గద్వాల జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి, జడ్పీ చైర్మన్ సరిత అన్నారు.శనివారం గద్వాల జిల్లా కేంద్రం లోని ఇండోర్ స్టేడియం లో స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా (ఫ్రీడమ్ కప్) జిల్లాస్థాయి క్రీడా పోటీలలో గెలుపొందిన విజేతలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై బహుమతులను ప్రధానం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. క్రీడల వల్ల వివిధ గ్రామాల క్రీడాకారుల మధ్య స్నేహభావం పెరుగుతుందని, మానసిక ఉల్లాసానికి, ఆరోగ్య పరిరక్షణకు క్రీడలు దోహదపడతాయని ఆమె తెలిపారు. గ్రామ, మండల, జిల్లా స్థాయిలో క్రీడలు నిర్వహించి అంగన్వాడి టీచర్ లను, ఉద్యోగులను ఇందులో భాగం చేశామని ఆమె తెలిపారు. కోకో, కబడ్డీ, వాలీబాల్, టగ్ ఆఫ్ వార్ క్రీడల పోటీలలో గెలుపొందిన విజేతలకు ఆమె బహుమతులను ప్రధానం చేశారు….