క్రీడలు శారీరక మానసిక దృఢత్వాన్ని ఇస్తాయి *మెదక్ జడ్పీ చైర్పర్సన్ హేమలత శేఖర్ గౌడ్

 తూప్రాన్ జనం సాక్షి ఆగస్టు 14::  క్రీడలు మానసిక శారీరిక దృఢత్వాన్ని ఇస్తాయని మెదక్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి హేమలత శేఖర్ గౌడ్ పేర్కొన్నారు ఈరోజు స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా జరుగుతున్న కార్యక్రమాలలో భాగంగా మెదక్ జిల్లా మనోహర బాద్ మండలంలోని దండుపల్లి గ్రామంలో క్రీడలను ప్రారంభించిన సందర్భంగా ఆమె మాట్లాడారు. క్రీడలలో గెలుపు ఓటములు సహజమని ఓడినవారు మళ్లీ వచ్చే పోటీలలో గెలిచే అవకాశం ఉంటుందని ఆమె పేర్కొన్నారు క్రీడలు శారీరకంగా దృఢత్వాన్ని మరియు  మానసిక వికాసాన్ని పెంపొందిస్తాయని కావున ప్రతి ఒక్కరు క్రీడలలో పాల్గొనాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పురం నవనీత రవి  ఎంపిడివో యాదగిరి రెడ్డి   వైస్ ఎంపీపీ విటల్ రెడ్డి ఎంపీటీసీ లత వెంకట్ గౌడ్  , ఎంపీ ఓ లక్ష్మీ నర్సింలు  ఎస్సై రాజ గౌడ్ ఏపిఎం పెంట గౌడ్  పార్టీ అద్యక్షులు మహేష్  సర్పంచ్ పంజాల నర్సమ్మ నాయకులు బిక్షపతి  ఉప సర్పంచ్ మహేందర్ గౌడ్ , బండి నరేందర్ గౌడ్ ఆత్మ కమిటీ సభ్యులు బిక్షపతి సుధాకర్  తదితరులు పాల్గొన్నారు
 

తాజావార్తలు