క్రీడాకారులు గెలుపే లక్ష్యంగా ఆడాలి

రైస్ మిల్లర్స్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కర్నాటి రమేష్

నిర్వాహకులు రంగా శ్రీధర్ ఆధ్వర్యంలో సన్మానం

మిర్యాలగూడ, జనం సాక్షి

క్రీడాకారులు గెలుపే లక్ష్యంగా ఆడాలని రైస్ మిల్లర్స్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కర్నాటి రమేష్ అన్నారు.మిర్యాలగూడ పట్టణం హౌసింగ్ బోర్డ్ లో గల క్లియో స్పోర్ట్స్ అరేనా లో శుక్రవారం 8వ యోనెక్స్ సన్‌రైజ్ తెలంగాణ స్టేట్ సబ్-జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ లను సందర్శించేందుకు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కర్నాటి రమేష్, మిల్లర్స్ అధ్యక్షులు గౌరు శ్రీనివాస్, మిల్లర్స్ కార్యదర్శులు వెంకటరమణ చౌదరి (బాబి) రంగా లింగయ్య, గుడిపాటి శ్రీనివాస్, కోశాధికారి పైడిమర్రి సురేష్, యోగ క్లబ్ ప్రధాన కార్యదర్శి, బిసి ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకులు కోలా సైదులు ముదిరాజ్, యాదవ్ సంఘం డివిజన్ నాయకులు శ్రీనివాస్ యాదవ్,
వచ్చిన సందర్భంగా రాష్ట్ర స్థాయి బ్యాట్మెంటన్ పోటీల నిర్వాహకులు, బ్యాట్మెంటన్ అసోసియేషన్ నల్గొండ జిల్లా కోశాధికారి రంగా శ్రీధర్ స్వాగతం పలికారు అనంతరం వారందరినీ రంగా శ్రీధర్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కర్ణాటి రమేష్ మాట్లాడుతూ మిర్యాలగూడ పట్టణంలో రాష్ట్రస్థాయి బ్యాట్మెంటన్ పోటీలు రంగా శ్రీధర్ నిర్వహించడం అభినందనీయన్నారు. పోటీలను సందర్శించేందుకు బ్యాట్మెంటన్ చీఫ్ కోచ్ గోపీచంద్ మిర్యాలగూడ కు రావడం హర్షనీయమన్నారు. ఈ కార్యక్రమంలో బ్యాట్మెంటన్ అసోసియేషన్ నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శి రంగారావు, బ్యాట్మెంటన్ అసోసియేషన్,కోచ్ రామకృష్ణ,
క్లియో స్పోర్ట్స్ అరేనాల స్టేడియం నిర్వాహకులు, ఏచూరి శ్రీ హర్ష నేతి రాహుల్ తదితరులు పాల్గొన్నారు.