క్రీడా మైదానం ను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే సుంకే రవిశంకర్
క్రీడా మైదానం స్థలం పై సర్వే చేయించి హద్దులు కేటాయించండి
మైదాన స్థలమును కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోండి అధికారులకు ఆదేశాలు జారీ చేసిన ఎమ్మెల్యే
చొప్పదండి ,అక్టోబర్ 14 (జనం సాక్షి ):చొప్పదండి జిల్లా పరిషత్ పాఠశాల క్రీడా మైదానం కు సంబంధించిన నాలుగు ఎకరాల 34 గుంటల స్థలమును సర్వే చేయించి హద్దులు కేటాయించి స్థలంలో కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ తహసిల్దార్ రజితకు ఆదేశాలు జారీ చేశారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కు సంబంధించిన క్రీడా మైదానంలో మంజూరైన ఓపెన్ జిమ్ పనులు నడుస్తుండగా ఆ స్థలంలో మాకు కొంత భూమి వస్తుందని చొప్పదండి పట్టణ కర్ర మరియు ఇనుము సహకార సంఘం సభ్యులు పనులు అడ్డుకోవడంతో మునిసిపల్ కమిషనర్ చైర్ పర్సన్ లు గురువారం వారితో మాట్లాడి పనులు అడ్డుకోవద్దని సహకార సభ్యులకు సూచించారు. శుక్రవారం ఓపెన్ జిమ్ పనులకు వచ్చిన కూలీలను పారిశ్రామిక సహకార సంఘం సభ్యులు తిరిగి పంపడంతో విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ క్రీడా మైదానమును పరిశీలించి ఓపెన్ జిమ్ పనులకు ఎవరైనా ఆటంకం కలిగిస్తే వారిపై చర్యలు తీసుకోవాలని ఎస్ఐ ఉపేంద్ర చారి కి ఆదేశించారు. ఈ స్థలంలో కర్ర పారిశ్రామిక సంఘం సభ్యులకు ఏమైనా భూమి వస్తే నిర్మాణం చేసిన ఓపెన్ జిమ్ ను ముందుకు జరిపిస్తామని వారికి హామీ ఇచ్చారు. చొప్పదండి జిల్లా పరిషత్ పాఠశాలకు సంబంధించిన క్రీడా మైదానం కు నాలుగు ఎకరాల 34 గుంటల స్థలం ఉందని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కరుణశ్రీ ఎమ్మెల్యేకు వివరించారు. వెంటనే ఎమ్మెల్యే తహసిల్దార్ కు ఫోన్ చేసి క్రీడా మైదానం సంబంధించిన నాలుగు ఎకరాల 34 గుంటల భూమిపై సర్వే చేపట్టి హద్దులు కేటాయించి కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఓపెన్ జిమ్ పనులు యధావిధిగా కొనసాగించాలని సూచించారు. అనంతరం చొప్పదండి వ్యవసాయ మార్కెట్ యార్డులో నిర్మాణం చేస్తున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులను పరిశీలించి పనుల ఆలస్యంపై కాంట్రాక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు వెంటనే పూర్తిచేసి మార్కెట్ ను తొందరగా ప్రారంభించాలని కాంట్రాక్టర్కు ఆదేశాలు జారీ చేశారు .ఎమ్మెల్యే వెంట మున్సిపల్ చైర్ పర్సన్ గుర్రం నీరజ, వైస్ చైర్ పర్సన్ ఇప్పనపల్లి విజయలక్ష్మి ,కౌన్సిలర్ మాడూరి శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ శాంతి కుమార్ ,సింగిల్ విండో చైర్మన్ తిరుపతిరావు, టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు వెల్మ శ్రీనివాస్ రెడ్డి ,వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సామల రాజు, ఉపాధ్యక్షుడు చీకట్ల కుమార్ ,మాజీ ఎంపీపీ వా ల్లాల కృష్ణ హరి ,మాజీ జెడ్పిటిసి ఇప్పనపల్లి సాంబయ్య ,రైతు సమన్వయ సమితి జిల్లా సభ్యులు గడ్డం చుక్కారెడ్డి, నాయకులు మాచర్ల వినయ్ కుమార్ ,నలమాచి రామకృష్ణ ,తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్ ,ఏనుగు స్వామి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.