క్లారిటీలేని టిఆర్‌ఎస్‌ సభ: శశిధర్‌ రెడ్డి

మెదక్‌,సెప్టెంబర్‌3(జ‌నం సాక్షి): తెరాస ప్రగతి నివేదన సభలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఏం చెప్పదల్చు కున్నారో కూడా క్లారిటీ లేకుండ పోయిందని మెదక్‌ మాజీ ఎమ్మెల్యే, పిసిసి అధికార ప్రతినిధి పి.శశిధర్‌ రెడ్డి అన్నారు. ఇంతకు టిఆర్‌ఎస్‌ ఎన్నికలకు పోతుందా లేదా అన్న స్పష్టత కూడా లేకుండా పోయిందన్నారు. ఎన్నికల్లో ఇవ్వని హావిూలు అమలు చేశామంటున్న కెసిఆర్‌ ఎన్నికల్లో ఇచ్చిన హావిూలు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. నిరుద్యోగులకు లక్ష ఉద్యోగాలు ఇస్తామన్న హావిూ ఏమైందని నిలదీశారు. ప్రగతి నివేదన సభ కాస్తా.. ప్రగతి ఆవేదన సభగా మారిందని ఉత్తమ్‌ విమర్శించారు. ప్రజల సొమ్ముతో బలప్రదర్శన చేశారని, ఎక్కడెక్కడి నుంచో జనాలు రప్పించి హైప్‌ చేశారని అన్నారు. స్కూళ్లు, కాలేజీ యాజమాన్యాలను ఎంవీఐల ద్వారా బెదిరించి బస్సులను సభకు ఉపయోగించుకున్నారు. ఇందుకోసం కోట్లు వృధా చేయడం అవసరమా అని అన్నారు. ఢి/-లలీ చుట్టూ ఎవరు తిరుగుతున్నారో అందరికీ తెలుసన్నారు. ఎన్నికలకు వెళతామని చెప్పుకునే ధైర్యం లేనప్పుడు ఎందుకు సభలు పెట్టాలని అన్నారు.