క్వార్టర్స్‌కు సైనా నెహ్వాల్

258

(చైనా): చైనా ఓపెన్ ప్రీమియర్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ శుభారంభం చేసింది. మహిళ సింగిల్స్ విభాగంలో మొదటి రౌండ్ లో విజయం సాధించి రెండో రౌండ్ లో అడుగుపెట్టింది. టాప్ సీడ్‌గా బరిలోకి దిగిన తొలి రౌండ్ లో చైనా యువతార, ప్రపంచ 11వ ర్యాంకర్ సున్ యును వరుస సెట్లలో ఓడించింది. 22-20, 21-18తో విజయం సాధించింది. 49 నిమిషాల్లోనే మ్యాచ్ ముగియడం విశేషం.

పురుషుల సింగిల్స్ లో భారత షట్లర్ అజయ్ జయరామ్ తొలి రౌండ్ లోనే ఓడిపోయాడు. చైనా టాప్ సీడ్ ప్లేయర్ చెన్ లాంగ్ చేతిలో 12-21, 11-21 తేడాతో పరాజయం పాలయ్యాడు.