క్వార్టర్స్‌లో శివ థాపా, దేవేంద్రో

కియానన్ (చైనా): ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ బాక్సింగ్ టోర్నమెంట్‌లో భారత బాక్సర్లు శివ థాపా (56 కేజీలు), దేవేంద్రో సింగ్ (49 కేజీలు) క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు.  సోమవారం జరిగిన బౌట్‌లలో శివ థాపా 3-0తో మైయోంగ్‌క్వాన్ లీ (కొరియా)పై గెలుపొందగా… దేవేంద్రో 3-0తో మొహమ్మద్ ఫువాద్ (మలేసియా)ను ఓడించాడు. అయితే భారత్‌కే చెందిన గౌరవ్ బిధురి (52 కేజీలు), మన్‌దీప్ జాంగ్రా (69 కేజీలు) మాత్రం ఓడిపోయారు.