క్షణికావేశంలో ఆత్మహత్యలు చేసుకోవద్దు…పెద్దేముల్ ఎస్ఐ అబ్దుల్ రవూఫ్…*
పెద్దేముల్ ఆగస్టు 10 (జనం సాక్షి)
క్షణికావేశంలో ఎవరు కూడా ఆత్మహత్యలకు పాల్పడవద్దని పెద్దేముల్ ఎస్సై అబ్దుల్ రవూఫ్
సూచించారు. ఆదివారం పెద్దేముల్ మండల పరిధిలోని బండమీదిపల్లి,తట్టేపల్లి గ్రామాలలో పెద్దేముల్ ఎస్సై అబ్దుల్ రవూఫ్ ఆత్మహత్యలపై అవగాహన కల్పించారు. సీసీ కెమెరాలు పట్ల,రోడ్డు ప్రమాదాల పట్ల గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్సై అబ్దుల్ రవూఫ్ మాట్లాడుతూ…. మానవ జీవితం నేడు యాంత్రి కంగా మారింది. క్షణం తీరిక లేకుండా ఒత్తిడికి గురవుతు న్నారు. తనకు ఉన్న సమస్యను పరిష్కార మార్గం ఆలోచించే సమయం, తీరిక లేకపోవడంతో క్షణికావేశంలో జీవితంపై విరక్తి పెంచుకుని ఆత్మహత్యకు పాల్పడి కుటుంబ సభ్యులకు, బంధువులకు, స్నేహితులకు తీరని విషాదాన్ని మిగులుస్తున్నారు. ప్రతి గ్రామంలో సిసి కెమెరాలు తప్పకుండా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.సిసి కెమెరాలు అందుబాటులోకి వస్తున్నాయని, వీటిని ప్రతి గ్రామంలో ఏర్పాటు చేయడం ద్వారా నేర రహిత సమాజాన్ని నిర్మించడంలో సిసి కెమెరాలు కీలకంగా మారుతున్నాయని చెప్పారు. గ్రామంలో సిసి కెమెరాల ఏర్పాటుకు ముందుకు రావాలని అప్పుడే గ్రామీణ ప్రాంతాలలో నేరాలను నియంత్రించడంతో పాటు అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా ప్రశాంత వాతావరణం కల్పించేలా చేయడంలో సిసి కెమెరాలు ఉపయోగపడతాయని ఆయన చెప్పారు. మీ గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరిగిన, అత్యవసర సమయాల్లో 100 కి ఫోన్ చేయాలని వస్తే అబ్దుల్ రవూఫ్ సూచించారు.