క్షయవ్యాధి నియంత్రణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి.
క్షయవ్యాధి నియంత్రణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి.
దోమ న్యూస్ జనం సాక్షి.
క్షయ వ్యాధి నియంత్రణకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలని టిబి హెచ్ వి సూప్రవైజర్ రాజునాయక్, ఏ ఎన్ ఎం ప్రమీల అన్నారు. శుక్రవారం దోమ మండల పరిధిలోని దిర్సం పల్లి గ్రామంలో టీబీ క్యాంపు నిర్వహించారు. ఈ సంధర్భంగా వారు మాట్లాడుతూ… వచ్చే 2025 నాటికి టీబిని పూర్తిగా అరికట్టాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు తెలిపారు. టీబీతో ప్రతి ఏడాది ఎంతోమంది మరణిస్తున్నారని, ప్రజల్లో ఆ వ్యాధిపై సరైన అవగాహన లేకపోవడమే కారణమని, రెండు వారాలకు మించి దగ్గు, తెమడ సాయంత్రం జ్వరం రావడం, ఆకలి, బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే దవాఖానల్లో పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. టీబీ వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వం ఉచితంగా మందులను సరఫరా చేయడంతో పాటు ప్రతినెలా పౌష్టికాహారం తీసుకునేందుకు రూ.500 పంపిణీ చేస్తున్నదని వివరించారు. ప్రపంచ వ్యాప్తంగా క్షయ వ్యాధిగ్రస్తులు 8.7.మిలియన్లు ఉంటే, ఒక్క భారతదేశంలోనే ఈ సంఖ్య 2.0 మిలియన్లుగా ఉందని ఆందోళన వెలిబుచ్చారు.మన దేశంలో టి.బిని నియంత్రిస్తే ప్రపంచ వ్యాప్తంగా ఈ వ్యాధిని చాలా వరకు నిర్మూలించినట్లు అవుతుందని అన్నారు. సరైన చికిత్స తీసుకుంటే టి.బి వ్యాధి నయం అవుతుందని,వైద్య సేవల విషయంలో నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందన్నారు. ఈ క్యాంపులో 15 టీబీ శాంపిల్స్ తీసుకోవటం జరిగిందనీ తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎస్ టి ఎల్ ఎస్ నవీన్ గౌడ్, ఎస్ టి ఎస్ గోపాల్, ఆశ వర్కర్, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Attachments area
|
|