ఖమ్మంలో రైతులకు మద్దతుగా నారాయణ ఆందోళన
ఖమ్మం : పోడు భూములను సాగుచేసుకుంటున్న రైతులకు మద్దతుగా సీపీఐ రాష్ట్ర నాయకుడు నారాయణ ఆందోళనకు దిగారు. ఖమ్మం జిల్లా వైరా మండలం తుమ్మలపల్లిలో పోడు భూములను సాగుచేసుకుంటున్న రైతులను అధికారులు అడ్డుకుని భూముల చుట్టూ కంచె వేసే పనులు చేపట్టారు. విషయం తెలుసుకున్న నారాయణ అక్కడికి వెళ్లి రైతులకు మద్దతుగా ఆందోళనకు దిగారు. కంచె వేస్తున్న అధికారులను అడ్డుకున్నారు.