ఖమ్మంలో స్టీల్‌ప్లాంట్ ఏర్పాటు చేయాలి: వీహెచ్
సిద్ధిపేట అర్బన్: బయ్యారం గనులున్న ఖమ్మం జిల్లాలో కూడా స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత ఎంపీ వి.హనుమంతరావు కోరారు. హైదరాబాద్ నుంచి కరీంనగర్ వెళ్తున్న ఆయన మెదక్ జిల్లా సిద్ధిపేటలో ఆగి విలేకరులతో మాట్లాడారు. విశాఖ స్టీల్‌కు బయ్యారం గనులను కేటాయించటం స్వాగతించదగ్గ విషయమని, అలాగే గనులున్న ఖమ్మం జిల్లాలో కూడా స్టీల్‌ప్లాంట్ ఏర్పాటు చేస్తే అక్కడి ప్రజలకు ఉపాధి లభిస్తుందన్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులు తమ పదవులకు రాజీనామాలు చేయాలని అప్పుడే ప్రజలకు పార్టీ పట్ల విశ్వాసం పెరుగుతుందన్నారు.