ఖమ్మం గనులపై కేసీఆర్ కన్ను – టీ.టీడీపీ నేత ఎర్రబెల్లి
హైదరాబాద్, (మార్చి5): ముఖ్యమంత్రి కేసీఆర్ కన్ను ఖమ్మం జిల్లా గనులపై పడిందని టీ.టీడపీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆరోపించారు. త్వరలోనే తెలుగుదేశం నేతలు ఖమ్మం జిల్లాలో పర్యటిస్తామని ఆయన అన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం వాస్తు పేరు చెప్పి కేసీఆర్ సెక్రటేరియట్‌ను ఖాళీ చేస్తున్నారని, నగరం నడిబొడ్డున ఉండి పేదరోగులకు సాంత్వన చేకూరుస్తున్న చాతీ ఆస్పత్రిని అడవిలోకి మారుస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇప్పుడు కేసీఆర్ కన్ను ఖమ్మం జిల్లా గనులపై పడిందని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఖమ్మం గనుల జోలికి వస్తే ఊరుకోమని ఆయన హెచ్చరించారు.