ఖమ్మం జిల్లాలో పంజా విసిరిన మావోయిస్టులు
ఖమ్మం,(జనంసాక్షి): ఖమ్మం జిల్లాలో మావోయిస్టులు మరోసారి పంజా విసిరారు. వెంకట్రాపురం మండలం విజయపురి కాలనీలో పోలీస్ ఇన్ఫార్మర్ అనే నెపంతో భగత్ అనే వ్యక్తిని కాల్చి చంపారు. రెండు నెలల క్రితం జరిగిన పువ్వాడ ఎన్‌కౌంటర్‌కు నిరసనగా భగత్‌ను చంపామని మావోయిస్ట్‌లు లేఖ వదిలి వెళ్లారు.
భగత్ పోలీసులకు సమాచారం ఇవ్వడం వల్లే పువ్వాడ ఎన్‌కౌంటర్‌లో 9 మంది నక్సల్స్ మృతి చెందిరని అందులో వివరించారు. కాగా భగత్ క్రైం బ్రాంచ్ కానిస్టేబుల్ సీతారాంకు ఇన్‌ఫార్మర్ వ్యవహరించేవాడు. గతంలో అతను కొంతకాలం పామేడు సీపీఐ మావోయిస్టు దళ సభ్యుడిగా పనిచేశాడు. ఇటీవలీ భగత్ పోలీసులకు లొంగిపోయాడు.