ఖమ్మం జిల్లాలో పోడు వివాదం
ఖమ్మం: ఖమ్మం జిల్లా చంద్రుగొండ మండలం మర్రిగూడెంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. అటవీ శాఖ అధికారులు, పోడు రైతులకు మధ్య ఘర్షణ జరిగింది. పోడు భూములను స్వాధీనం చేసుకునేందుకు వెళ్లిన అటవీశాఖ అధికారులను పోడు రైతులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. ఓ స్థాయిలో తోపులాట కూడా జరిగింది. ఈ ఘర్షణలో10 మంది రైతులకు గాయాలవ్వగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఐదుగురు అటవీ అధికారులు కూడా గాయాలయ్యాయి.