ఖమ్మం జిల్లాలో మంత్రి హరీష్‌రావు పర్యటన
ఖమ్మం : నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు ఇవాళ ఖమ్మం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా హరీష్‌రావుకు టీఆర్‌ఎస్ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. కొణిజెర్ల మండలం తనికెళ్ల వద్ద మంత్రికి ఎమ్మెల్యే మదన్‌లాల్ ఆహ్వానం పలికారు. తెలంగాణ తల్లి విగ్రహానికి మంత్రి పూలమాల వేశారు. తనికెళ్ల నుంచి వైరా వరకు టీఆర్‌ఎస్ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. పర్యటనలో భాగంగా వైరా చెరువును మంత్రి పరిశీలించారు. చెరువుల పునరుద్ధరణలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని మంత్రి పిలుపునిచ్చారు. మిషన్ కాకతీయలో భాగంగా మంత్రి హరీష్‌రావు జిల్లాల్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.