ఖమ్మం రోడ్లపై గులాబీ జెండాల ప్రవాహం
ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో టిఆర్ఎస్ దూసుకుపోతోంది. ఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్ధి పల్లా రాజేశ్వర్ రెడ్డికి మద్దతుగా ఖమ్మంలో భారీ ప్రదర్శన జరిగింది. నగరంలో గులాబీ జెండాల ప్రవాహం సాగింది. వందలాది మంది పట్టభద్రులు, టిఆర్ఎస్ కార్యకర్తలు మోటార్ సైకిళ్లపై ప్రదర్శనలో పాల్గొన్నారు. మంత్రులు హరీశ్ రావు, తుమ్మల నాగేశ్వరరావు, పార్లమెంటరీ కార్యదర్శి జలగం వెంకట్రావు, ఎమ్మెల్సీ అభ్యర్ధి పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, టిఆర్ఎస్ నేతలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు.