ఖాళీ పోస్టులు భర్తీ చేయాలి: తిరుపతి ఎమ్మేల్యే భూమన

హైదరాబాద్‌,జనంసాక్షి: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలు తక్షణమే భర్తీ చేయాలని  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి డిమాండ్‌ చేశారు. ఎన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, కొత్తగా ఎంత మందిని నియమించారనే దానిపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. ఉద్యోగాలు భర్తీకి ప్రభుత్వం పూనుకోకుంటే తమ పార్టీ తరపున పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఆయన హెచ్చరించారు.