ఖుర్షీద్‌ గద్దె దిగే వరకూ.. నిరసన ఆగదు : కేజ్రీవాల్‌

న్యూఢిల్లీ, అక్టోబర్‌ 13 (జనంసాక్షి) : అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర న్యాయ శాఖ మంత్రి ఖుర్షీ’ రాజీనామా చేయడమా? లేదా ప్రధాని అతన్ని క్యాబినెట్‌ నుంచి బర్తరఫ్‌ చేసే వరకూ తమ ఆందోళన కొనసాగుతుందని అవినీతి వ్యతిరేక ఉద్యమకా రుడు అరవిం’ కేజ్రివాల్‌ స్పష్టం చేశారు. ఖుర్షీ’ రాజీనామా చేసే వరకూ పార్లమెంట్‌ వీధుల్లో నిరసన కొనసాగిస్తామని తేల్చిచెప్పారు. న్యాయ శాఖ మంత్రి ఖుర్షీ’ రాజీనామాకు డిమాాం చేస్తూ ప్రధాని నివాసం వద్ద వికలాం గులతో కలిసి ఆందోళనకు దిగిన కేజ్రివాల్‌ను, ఆయన అనుచరులను పోలీసులు శనివారం మధ్యాహ్నం వరకు భావనా స్టేడియంలోనే నిర్బంధించారు. కేజ్రివాల్‌ జైలులోనూ తన ఆందోళన కొనసాగించారు. ఖుర్షీ’ రాజీనామా చేసే వరకు జైలు నుంచి విడుదలయ్యేది లేదని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు, అరవిం’ కేజ్రివాల్‌ అరెస్టుకు నిరసనగా ఆయన మద్దతుదారులు శనివారం ఢిల్లీలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. సంస్థ’ మ్గాంలో వికలాంగులతో కలిసి పలు సేవా సంస్థల నిర్వాహకులు ధర్నా నిర్వహించారు. స్వచ్ఛంద సంస్థలో నిధుల అవకతవకలకు పాల్పడిన కేంద్ర న్యాయశాఖ మంత్రి సల్మాన్‌ ఖుర్షీ’ రాజీనామా చేయాలని డిమాాం చేశారు. కేజ్రివాల్‌కు మద్దతుగా ఆందోళనలు మిన్నంటడంతో పోలీసులు ఆయనతో పాటు అరెస్టు చేసిన వారందరిని శనివారం మధ్యాహ్నం విడుదల చేస్తున్నట్లు   ప్రకటించారు. విడుదలైన అనంతరం కేజ్రివాల్‌ మాట్లాడుతూ.. ఖుర్షీ’ రాజీనామా చేసే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని, ప్రజలంతా పోరాటానికి మద్దతివ్వాలని కోరారు. ఖుర్షీ’ లాంటి వ్యక్తులను పార్లమెంట్‌ నుంచి బయటకు పంపే వరకూ తమ పోరాటం ఆగదని స్పస్టం చేశారు. అవినీతిపై ఉద్యమిస్తున్న తమ నోరు నొక్కేయాలని ప్రభుత్వం భావిస్తే అది పొరపాటని అన్నారు. ఉద్యమాన్ని అణచివేసేందుకు ప్రభుత్వం చేసే ఒక్కో ప్రయత్నమే అవినీతి వ్యతిరేక ఉద్యమానికి బలం చేకూరుస్తుందన్నారు. యువకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి నిరసనలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ”ఎవరి కోసమే మనం పోరాడడం లేదు. మన భవిష్యత్‌ కోసమే పోరాడుతున్నాం. పార్లమెంట్‌ స్ట్రీట్‌ పోలీసుస్టేషన్‌ మరో తెహ్రీర్‌ స్క్వేర్‌ కావాల్ణి అని అన్నారు. తమపై వచ్చిన ఆరోపణలు నిరాధారమని ఖుర్షీద్‌, ఆయన భార్య లూయీస్‌ చేస్తున్న వ్యాఖ్యలను కేజ్రివాల్‌ కొట్టిపడేశారు. వారిద్దరిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర మంత్రి అవకతవకలకు పాల్పడినా.. ప్రధాన ప్రతిపక్షం బీజేపీ ఎందుకు మౌనంగా ఉంటోందని ఆయన ప్రశ్నించారు.