గంగపుత్రులకు చేపలుపట్టే వృతి పై ప్రభుత్వం పూర్తి హక్కులు కల్పించాలి

గంగపుత్ర సంఘం అధ్యక్షులు పరిమి సురేష్
ఖానాపూర్ రూరల్ 21 నవంబర్ (జనం సాక్షి): గంగపుత్రులకు చేపలుపట్టే వృతి పై ప్రభుత్వం పూర్తి హక్కులు కల్పించాలి ఖానాపూర్ గంగపుత్ర సంఘం అధ్యక్షులు పరిమి సురేష్ అన్నారు. సోమవారం ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో బిష్ముని జెండా సంఘం అధ్యక్షులు ఎగురవేశారు. ఈ సందర్భంగా గంగపుత్ర సంఘం అధ్యక్షులు మాట్లాడుతూ రైతు భీమ లాగే గంగపుత్రులకు పది లక్షల భీమా సౌకర్యం కల్పించాలని, అలాగే ప్రతీ గంగపుత్రులకు మోపెడ్ బండ్లు ఇవ్వాలని,మా జీవన ఉపాధి చేపల వృతి పై పూర్తి హక్కులు గంగపుత్రులకు మాత్రమే కల్పించాలని, వేరే కులలవారిని ఈ గంగపుత్ర లో కల్పించ వద్దు అని ఆయన అన్నారు. ఒకవేళ వేరే కులాలను చేర్చినట్లు ఐతే గంగపుత్రులు అంత ఒక్కటి ఐ ప్రతిగటిస్తాము అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో గంగపుత్ర సంఘం ఉపాధ్యక్షుడు పరిమి రమేష్,ఎం పెద్దులు,గడ్డి సురేష్,కాశావేని గణేష్,పరిమి నర్సయ్య,భీంరావు,కిషన్,శ్రీనివాస్,చందు,రాము గంగపుత్రులు పాల్గొన్నారు.