గంజాయి తరలిస్తున్న డీసీఎం స్వాధీనం

మెదక్: మెదక్ జిల్లా నారాయణ్‌ఖేడ్ మండలంలో పోలీసులు 180 కిలోల గంజాయిని సీజ్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….ఎక్సైజ్ సీఐ మణెమ్మ, స్థానిక ఎస్సై సూర్య ప్రకాశ్ శుక్రవారం ఉదయం బీబీపేట వద్ద వాహనాల తనిఖీలు చేపట్టారు. ఆదిలాబాద్ జిల్లా పిట్లం నుంచి కర్ణాటక వైపు వెళ్తున్న డీసీఎంను తనిఖీ చేయగా 180 కిలోల  గంజాయితో పట్టుబడింది. లారీని ఎక్సైజ్ స్టేషన్‌కు తరలించి, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.