గంజాయి వినిగంపై నిఘా పెంచాలి.

సామాజిక కార్యకర్తలు నేరేడుచర్ల(జనంసాక్షి)న్యూస్. మున్సిపల్ పరిధిలో యువత గంజాయి సేవిస్తున్నట్లుగా అనుమానాలు ఉన్నాయని కొన్ని సందర్భాల్లో గంజాయి పట్టుబడి జరగటం వాటిని రుజువు చేస్తున్నాయని గంజాయి పై నిగ పెంచాలని కోరుతూ మంగళవారం నేరేడుచర్ల ఎస్సై నవీన్ కుమార్ కు,సామాజిక కార్యకర్తలు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతు,గత కొన్ని సంవత్సరాలుగా సూర్యాపేట జిల్లాలో ముఖ్యంగా హుజూర్నగర్ నియోజకవర్గంలో గంజాయి విక్రయ ముఠాలు చాలాసార్లు పట్టుబడ్డారని నేరేడుచర్ల లో కూడా దాని ఆనవాళ్లు కనిపిస్తున్నాయని ముఖ్యంగా యువత దానికి బానిసై తమ అమూల్యమైన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని అంతేకాకుండా వివిధ రకాల నేరాలకు గంజాయి సేవించడం కూడా కారణం అవుతుందని వెంటనే దీనిపై నిఘా పెంచి గంజాయి రహిత నేరేడుచర్లగా మార్చేందుకు తగు చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్త న్యాయవాది సుంకర క్రాంతి కుమార్, కొప్పు రామకృష్ణ గౌడ్, జింకల భాస్కర్,యరవ సురేష్, కాసాని నాగరాజు,జంపాల శ్రవణ్, శివశంకర్ లు పాల్గొన్నారు.