గంజాయి స్వాధీనం – ఎండు మొక్కలను తగుల పెట్టిన పోలీస్ శాఖ

 జిల్లాలోని భారీ ఎత్తున గంజాయి
గంజాయి నీ స్వాధీనం చేసుకుని ఎన్ని మొక్కలను తగులబెట్టినట్లు పోలీస్ శాఖ జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ, ( 905 )  కిలోల  ఎండు గంజాయి , (198 ) గంజాయి మొక్కలను శనివారం ఉదయం
 రామరెడ్డి మండలం  మద్దికుంట అటవి ప్రాంతం లో  దహన సంస్కారం పద్ధతిలో గంజాయి మొక్క లను తగులలబెట్టమని చెప్పారు.  కామా రెడ్డి జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లో ( 28)  కేసులలో బయట పడ్జాయన్నారు.  అక్రమ రవాణా, అమ్మకాలు చేసిన నేరస్తులను అరెస్టు చేయడం జరిగిందన్నారు. ధర్యాప్తు చేయగ  2011 సంవత్సరం నుంచి ఇప్పటివరకు  సీజ్ చేసినటువంటి గంజాయి సరఫరా, గంజాయి మొక్కలు   మొత్తం ( 904.951)  కిలోల  ఎండు గంజాయి , 198 గంజాయి మొక్కలను జిల్లాలోని పదకొండు  పోలీస్ స్టేషన్ ల పరిదిలో గుర్తించామన్నారు.  వాటిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన జీవో   ప్రకారం   అదేవిధంగా  డీజీపీ ఇచ్చిన సూచనల ప్రకారం నిర్వీర్యం చేయడానికి డ్రగ్ డిస్పోజల్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగినదన్నారు. ముందుగా దేవునిపల్లి, రాజంపేట, సదాశివనగర్ తాడువాయి , లింగంపేట్, గాంధారి, నాగిరెడ్డిపేట్, పిట్లం, జుక్కల్ ,  బిచ్కుంద పోలీస్ స్టేషన్లలో నిల్వ ఉన్న గంజాయి, మొక్కలను సోప్  ( స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్) ప్రకారం ముందుగా జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటుచేసిన  సేఫ్ హౌస్ (Safe House) లోకి తీసుకున్నం అన్నారు.
గంజాయిని పదిహేను రోజులు నిల్వ ఉంచడం జరిగిందన్నారు. ఉన్నత అధికారులతో పాటు జిల్లా కలెక్టర్  ,  ఫారెస్ట్ అధికారులకు అదే విధంగా పొల్యూషన్ కంట్రోల్ వారికి సమాచారం  అందిం చామని చెప్పారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ  J. అన్యోన్య    కామారెడ్డి రూరల్ సిఐ శ్రీనివాస్ , స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఆర్మూర్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ సుభాష్ ,  రామారెడ్డి ఎస్ఐ అనిల్,   వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Attachments area