గండివేట్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం
గాంధారి జనంసాక్షి అక్టోబర్ 07
గాంధారి మండలంలోని గండివేట్ గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1998 బ్యాచ్ పదవ తరగతి విద్యార్థులు శుక్రవారం పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని నిర్వహించుకున్నారు సుమారు ఐదు సంవత్సరాల తర్వాత కలుసుకున్న మిత్రులు తమ తమ అనుభవాలను ఆలోచనలను గత పోయిన రోజులను నెమరు వేసుకున్నారు ఎప్పుడు కలిసినా పాఠశాలలో జరిగిన సంఘటనలు గుర్తుకు చేసుకొని వాటి ద్వారా తమ ఆనందం ఒకరితో ఒకరు పంచుకున్నారు ఈ సమ్మేళనంలో ఆ బ్యాచ్కి చెందిన విద్యార్థులు నూతన కమిటీ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు ఇకనుంచి ప్రతి సంవత్సరం 6 నెలలకు ఒకసారి కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు అందరం ఆనందంగా గడపడానికి ఈ వేదిక చక్కగా ఉపయోగపడుతుందని తమ సంతృప్తిని వెల్లడించారు