గజ్వెల్‌లో ఇక తిరుగులేని శక్తిగా టిఆర్‌ఎస్‌

వంటేరు చేరికతో మారనున్న సవిూకరణాలు

ఉనికి కోల్పోయిన విపక్ష పార్టీలు

గజ్వేల్‌,జనవరి19(జ‌నంసాక్షి): గజ్వేల్‌ సీనియర్‌ నాయకుడు వంటేరు ప్రతాప్‌ రెడ్డి టిఆర్‌ఎస్‌లో చేరడంతో ఇక్కడ దాదాపుగా కాంగ్రెస్‌ ఖాళీ అయినట్లే. దీనికితోడు నియోజకవర్గంలో ఇక అంతా అభివృద్ది లక్ష్యంగా ముందుకు సాగే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇక్కడి టిఆర్‌ఎస్‌కు ఎదురులేకుండా పోయింది. విపక్షపార్టీ అన్నది కనుమరుగు కానుంది. స్థానికులు కూడా ప్రతాపరెడ్డి నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా సీఎం కేసీఆర్‌ ప్రత్యర్థిగా నిలిచి ఓడిపోయారు. దీంతో ప్రతాప్‌ రాజకీయ భవిష్యత్‌ ప్రశ్నార్థకమైందని భావిస్తున్న తరుణంలో సీఎం కేసీఆర్‌ ప్రతాప్‌ సముచిత స్థానం కల్పిస్తూ

పార్టీలో చేర్చుకోవడంపై ప్రతాప్‌ పాటు ఆయన వర్గీయుల్లో ఆనందం వ్యక్తమవుతుంది. సీఎం కేసీఆర్‌ గజ్వేల్‌ అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాల అమలుతో ప్రజలకు మేలు జరుగుతున్నదని, టీడీపీ రాష్ట్ర వ్యతిరేక పార్టీగా మారగా, కాంగ్రెస్‌ వల్ల రాష్ట్ర ప్రజలకు నష్టాలే తప్పా, మేలు జరగడం లేదని ప్రతాప్‌ భావించి టీఆర్‌ చేరినట్లు ఆయన వర్గీయులు తెలిపారు.ప్రతాప్‌ కాంగ్రెస్‌కు గుడ్బై చెప్పడంతో ఆ పార్టీకి గట్టి దెబ్బే అని స్థానికులు, రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఆయన ఇటీవలే టీడీపీ నుంచి కాంగ్రెస్‌లో చేరి, ఎమ్మెల్యేగా పోటీలో దిగి, ఓటమి పొందిన తర్వాత పార్టీ క్యాడర్‌ అంతా చెల్లచెదురైంది. ఆయనతోపాటు కాంగ్రెస్‌ వీడి, పెద్ద సంఖ్యలో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. మిగతా వారు కూడా టిఆర్‌ఎస్‌లో చేరనున్నారు. దీంతో ఆ పార్టీకి కోలుకోలేని నష్టం ఏర్పడిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే, టీడీపీ సానుభూతిపరులుగా ఉన్న అనేక మంది సైతం ప్రతాప్‌ వెంటే టీఆర్‌ చేరుతున్నట్లు ప్రకటించడంతో ఆ పార్టీ నియోజకవర్గంలో పూర్తిగా కనుమరుగు కానుంది. శుక్రవారం తెలంగాణ భవన్‌ తన అనునాయులతో టీఆర్‌ చేరారు. ఆయనకు పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ గులాబీ కండువా కప్పి, పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఆయన వెంట గజ్వేల్‌ పట్టణ సీనియర్‌ నాయకుడు మెట్టయ్యతో పాటు పలువురు టీఆర్‌ఎస్‌లో చేరారు. రెండు దశాబ్దాలకు పైగా నియోజకవర్గంలో టీడీపీ సీనియర్‌ నాయకుడిగా పని చేసి, ఇటీవలే కాంగ్రెస్‌ చేరిన ప్రతాప్‌ గ్రావిూణ ప్రాంతాల్లో యువకుల్లో మంచి పట్టుంది. ప్రతాప్‌ చేరికతో కాంగ్రెస్‌,టిడిపిలకు కూడా కాలం చెల్లిందని భావిస్తున్నారు. టీడీపీ పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రతాప్‌ చేరికతో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో నియోజకవర్గం మరింత ముందుకు దూసుకెళ్తుందని పలువురు భావిస్తున్నారు. మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమిపాలైనా, ప్రజల్లోనే ఉంటూ మంచి గుర్తింపు పొందిన ప్రతాప్‌ సీఎం కేసీఆర్‌ ఆదరించి, పార్టీలో చేర్చుకోవడంపై ఆయన వర్గీయులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కొంత కాలంగా ప్రతాప్‌ నియోజకవర్గంలో కీలకపాత్ర వహిస్తూ ప్రజల్లో ఉంటూ మంచి గుర్తింపు పొందారు.

తాజావార్తలు