గజ్వేల్‌లో కేసీఆర్‌కు కందిరీగల స్వాగతం

మెదక్, మార్చి 12: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ జిల్లాలోని గజ్వేల్ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. కేసీఆర్ రాక సందర్భంగా ఆయనకు  స్వాగతం పలకడానికి స్థానిక ఎంపీ ప్రభాకర్ రెడ్డి, పలువురు నేతలు, జిల్లా అధికారులు హెలిపాడ్ వద్ద వేచియున్నారు. అయితే సీఎం హెలిక్యాప్టర్ ల్యాండ్ అయ్యే సమయంలో ఒక్క సారిగా అక్కడున్న వారిపై కందిరీగల గుంపు దాడి చేసింది. కందిరీగల దాడిలో ఎంపీ ప్రభాకర్ రెడ్డి తీవ్రంగా గాయపడినట్లు తెలిసింది. ఆయనను అధికారులు ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలిసిన నియోజకవర్గ టీడీపీ నేతలు కేసీఆర్‌కు కందిరీగలు స్వాగతం పలికాయని వ్యాఖ్యానించారు.