గజ్వేల్ వరకే మోదీ పర్యటన
హైదరాబాద్,జులై 28(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన అధికారికంగా ఖరారు అయింది. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి సీఎం కార్యాలయానికి అధికారికంగా సమాచారం అందింది. వచ్చే నెల 7వ తేదీన ప్రధాని తెలంగాణలో తొలిసారి పర్యటించనున్నారు. ఆయన పర్యటన మెదక్ జిల్లా గజ్వేల్‌కు మాత్రమే పరిమితం కానుంది. కేవలం ఒక్క పర్యటనతోనే ప్రధాని తిరిగి ఢిల్లీ చేరుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకం చేపట్టిన మిషన్ భగీరథ పైలాన్‌ను ప్రధాని ఆవిష్కరిస్తారు. ఏడో తేదీ మధ్యాహ్నం 3 గంటలకు గజ్వేల్ చేరుకుంటారు. కోమటిబండ వద్ద ఏర్పాటు చేసిన పైలాన్ ఆవిష్కరణ అనంతరం అక్కడి నుంచే రామగుండ్ ఎరువల ఫ్యాక్టరీ, కాళోజీ వర్సిటీ శంకుస్తాపన కార్యక్రమాలు చేపడతారు. అదే రోజు సాయంత్రం 4.15కి హైదరాబాద్ తిరుగు పయనం అవుతారు. హైదరాబాద్‌లో సాయంత్రం అయిదు గంటలకు బీజేపీ సమావేశంలో పాల్గొంటారు. రాత్రి 7 గంటలకు ప్రధాని మోదీ ఢిల్లీ బయల్దేరనున్నారు. ప్రధాని పర్యటనపై సిఎం కెసిఆర్ శుక్రవారం సవిూక్షించనున్నారు. సిఎస్ రాజీవ్ శర్మ కూడా సవిూక్షిస్తారు.