గట్టు ఎత్తిపోతలకు తొలగని అవాంతరాలు

ఏళ్లుగా ముందుకు కదలని పథకం

గద్వాల,జూలై11(జనం సాక్షి): ఒటిన్నర దశాబ్ద కాలంగా గట్టు ఎత్తిపోతల పథకం ప్రతిపాదన ల్లోనే ఉండిపోయింది. ఎన్నికల అస్త్రంగా గట్టు ఎత్తిపోతల పథకం వాగ్దానాల నడుమ నలుగుతోంది. రాజకీయాల కారణంగా గట్టు ఎత్తి పోతల పథకానికి కాలం కలసి రావడం లేదు. దశాబ్దాలుగా సాగు, తాగు నీటి కోసం
గట్టు, కేటీదొడ్డి మండలాల్లోని 20 గ్రామాలకుపైగా అవస్థలు పడుతున్నాయి. జిల్లా చుట్టూ ఉన్న కృష్ణా, తుంగభద్ర నదుల నుంచి గట్టు రైతాంగం కష్టాలను గ్టటెక్కెంచేందుకు చేస్తున్న ప్రయత్నాలకు అవాంతరాలు ఎదురవుతున్నాయి. అనేక రకాలు మార్పులు.. చేర్పులకు వేదికగా మారిన గట్టు ఎత్తిపోతల పథకానికి మోక్షం లభిస్తుందా లేదా అనే సందేహాలు వ్యక్తమ వుతున్నాయి. గట్టు ఎత్తిపోతల పథకంతో గట్టు, కేటీదొడ్డి మండలా ల్లోని 20 గ్రామాల పంట పొలాలకు సాగు నీరు ఇవ్వడా నికి రూ.550 కోట్లతో చేపట్టిన ప్రతిపాదనలకు ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు గత సంవత్సం ఆగస్టులో శంకుస్థాపన చేశారు. 33 వేల ఎకరాలకు సాగు నీరు అందిం చాలనే లక్ష్యంతో ఈ పథకానికి రూప కల్పన చేపట్టారు. గట్టు ఎత్తిపోతల పథకాన్ని 15 టీఎంసీలకు పెంచాలని సూచించారు. 15 టీఎంసీల సామర్థ్యం కలిగిన రిజర్వాయర్‌ నిర్మా ణానికి ఆమోద ముద్ర పడే సమయంలో మరో కొత్త ప్రతిపాదన తెరపైకి వచ్చింది. సముద్ర మట్టానికి 400 విూటర్ల ఎత్తులో గట్టు మండలం ఉంటుంది. గ్రామాలు కూడా గుట్టలు, బండరాళ్లు, ఇసుక దిబ్బల మధ్య ఉన్నాయి. పూర్తిగా ఇసుకతో కూడిన ఎర్ర నెలలుగా ఉన్నాయి. ఇలాంటి ఎత్తు ప్రాంతానికి సాగు నీరు అందించడం ఇరిగేషన్‌ శాఖకు సవాల్‌గా నిలిచింది. ర్యాలంపాడు రిజర్వాయర్‌ ద్వారా గట్టు ప్రాంతాల కు సాగునీరు అందిండచానికి సాధ్యం కావడం లేదు. దీంతో కొత్తగా గట్టు ఎత్తిపోతల పథకం నిర్మాణం చేపడితే కాని మోక్షం లభించదని రెండు దశాబ్దాల నాడు చేసిన ప్రతిపాదలను నేటికి అమలుకావడం లేదు. ఈ దుస్థితి వల్ల గట్టు మండలంలోని గట్టు, రాయపురం, పెంచికపాడు, చింతలకుంట, అలూరు, మన్నపురం తం డా, మల్లాపురం, సిద్దోనిపల్లిండా గ్రామాలతోపాటు, మండ లాల విభజన సమయంలో గట్టు మండలం నుంచి కేటీ దొడ్డి మండలంలో కలిసి కేటీదొడ్డి, నందిన్నె, బసవపురం, ఉమిత్యాల, కూచినర్ల, యేరుసందొడ్డి, సుల్తానాపురం, సోంపురం, మల్లాపురం తాండ గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాల్లోని 33 వేల ఎకరాలు బీడు భీములుగా కొన సాగుతున్నాయి. గట్టు ఎత్తిపోత పథకం నిర్మాణం జరిగితే కాని ఈ గ్రామాల కష్టాలు తీరవు. కాని గట్టు ఎత్తిపోతల పథకానికి 2005 నుంచి నేటికి వరకు అనేక అడ్డంకులు ఎదురవుతున్నాయి.