గడ్కరీ క్షమాపణ చెప్పాలి
అఖిలభారత రెవెన్యూ అధికారుల సంఘం డిమాండ్
న్యూఢిల్లీ : నిజాయతీగా తమ పనిచేసోనియకుండా బెదిరింపులకు పాల్పడిన భాజపా మాజీ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ క్షమాపణలు చెప్పాలని రెవెన్యూ అధికారుల సంఘం డిమాండ్ చేసింది. పూర్తి గ్రూపు లావాదేవీలపై విచారణ జరుపుతున్న అధికారులకు రక్షణ కల్పించాలని కూడా సంఘం కోరింది. జాతీయ స్థాయి రాజకీయనేత మాట్లాడవలసిన రీతిలో ఆయన మాట్లాడలేదని, గడ్కనీ చేసిన వ్యాఖ్యలు తమను దిగ్భ్రాంతికి గురిచేశాయని అధికారుల సంఘం పేర్కొంది.