గడ్కరీ తొలగింపుపై సంఘ్ విముఖత
ఢిల్లీ: భాజపా అధ్యక్ష పదవినుంచి నితిన్ గడ్కరీని వెంటనే తప్పించాలన్న డిమాండ్‌పై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ విముఖత వ్యక్తం చేస్తోంది, గడ్కరీని వెంటనే బాధ్యతల నుంచి తొలగించాలని భాజపా నేత రాంజెఠ్మలానీ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. వాస్తవానికి డిసెంబర్ 19తో గడ్కరీ పదవికాలం తీరనుంది. భాజపాలో జరుగుతున్న పరిణామాలను సంఘ్ వర్గాలు గమనిస్తున్నాయి.