గడ్కరీ రాజీనామాకు సుష్మ డిమాండ్: తెరపైకి అద్వానీ
న్యూడిల్లీ: నవంబర్ 6,(జనంసాక్షి):
స్వామి వివేకానందను దావూద్ ఇబ్రహీంతో పోల్చిన భారతీయ జనతా పార్టీ జాతీయ అద్యక్షుడు నితిన్ గడ్కరీ సొంత పార్టీ నేతల నుండి చిక్కులు ఎదుర్కోంటుంన్నారు. అవినీతి ఆరోపణలపై గడ్కరీకి మద్దతుగా నిలిచిన ఆ పార్టీ నేతలు పలువురు స్వామి వివేకానందను మాఫీయా డాన్ దావూద్ ఇబ్రహీం తో పోల్చడం పై మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గడ్కరీ రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
పార్టీ సీనియర్ నేత, లోక్‌సభా పక్ష నేత సుష్మా స్వరాజ్ పార్టీ అద్యక్ష పదవికి గడ్కరీ రాజీనామా చేయాలని, ఆయన స్ధానంలో సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీకి పార్టీ భాద్యతలు అప్పగించాలని మంగళవారం డిమాండ్ చేశారు. పార్టీ సీనియర్ నేతలు జశ్వంత్ సింగ్, యశ్వంత్ సింగ్‌లు కూడా గడ్కరీని పార్టీ అద్యక్షుడిగా తొలగించాలని అంతకు ముందు డిమాండ్ చేశారు.
ఎప్పటి నుంచో గడ్కరీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న ప్రముఖ న్యాయవాది, బిజెపి నేత రాం జెఠ్మలానీ అద్యక్ష స్ధానం నుండి నితిన్ తొలగించాలని, ఆయన అనేక అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. గడ్కరీ పై అవినీతి ఆరోపణలను వచ్చినప్పుడే జేఠ్మలానీ స్పందించారు.ఆయనను తొలగించాలని తాను ఎప్పుడో పార్టీ లో చెప్పానన్నారు.తాజాగా స్వామి వివేకానందునితో దావూద్ ను పోల్చడం గడ్కరీకి మరిన్ని చిక్కులు తెచ్చి పెట్టింది.