గడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రానికి ఆరు ఐసీఏఆర్ ప్రశంసా పత్రాలు

ప్రశంస పత్రాలను అందుకుంటున్న కేవీకే ఇంచార్జి ప్రోగ్రాం కోఆర్డినేటర్ బి. లవకుమార్
, జూలై 15 (జనం సాక్షి): మండలంలోని గడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రానికి భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి వ్యవసాయ సాంకేతికత పరిశోధనా వినియోగ సంస్థ ఐసీఏఆర్  తరపున 2021-22 సంవర్సరానికి  గాను వివిధ విభాగాల్లో 6 ప్రశంసా పత్రాలు వచ్చాయని కేవీకే  ఇంచార్జి ప్రోగ్రాం కోఆర్డినేటర్  బి లవకుమర్  తెలిపారు. జూలై నెల 12 నుండి 14 వరకు హైదరాబాదు సమీపంలో ఉన్న తిమ్మాపురం మండలం చేగూరు  గ్రామంలోని కన్హా శాంతి వనంలో జరిగిన జోన్-10లో ఉన్న ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు  రాష్ట్రాల కృషి విజ్ఞాన కేంద్రాల వార్షిక జోనల్ సమావేశంలో డా. జె.వి.ప్రసాద్ డైరెక్టర్ ఐ.సి.ఏ.ఆర్ ఆటారి  హైదరాబాదు మూడు రాష్ట్రాల వ్యవసాయ విశ్వవిద్యాలయాలకు చెందిన ఉపకులపతులు విస్తరణ సంచాలకులు ఆటారి శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. మూడు రోజుల సమావేశంలో ఆంధ్ర తెలంగాణ తమిళనాడు రాష్ట్రాలు పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతం యొక్క కె.వి.కె లు 2021 – 2022 సంవత్సరంలో చేపట్టిన వివిధ కార్యక్రమాల ప్రగతిని వివరించారు. ఈ కార్యక్రమ ముగింపు సమావేశంలో గడ్డిపల్లి  కృషి విజ్ఞాన కేంద్రం కు   రైతులకు  అందించిన వివిధ సేవలకు గుర్తింపుగా  ఉత్తమ ప్రదర్శనా క్షేత్రాల నిర్వహణ ఉత్తమ శిక్షణా కార్యక్రమాల నిర్వహణ ఉత్తమ నారు మొక్కల పెంపక కేంద్రం ఉత్తమ భూసార పరీక్షా  ఫలితాలు అందించడం ఉత్తమ కార్యాచరణ ప్రాయోజిత శిక్షణ ఉత్తమ రివాల్వింగ్ ఫండ్ నిర్వహణలో అత్యుత్తమమైన కార్యక్రమాలు చేపట్టినందుకు మొత్తం ఆరు ప్రశంసా పత్రాలను డా.జె.వి.ప్రసాద్, డైరెక్టర్ ఐ.సి.ఏ.ఆర్ ఆటారి  హైదరాబాదు మూడు రాష్ట్రాల వ్యవసాయ విశ్వవిద్యాలయాలకు చెందిన ఉపకులపతులు విస్తరణ సంచాలకుల చేతుల మీదుగా పొందినట్లు కేవీకే ఇంచార్జి ప్రోగ్రాం కోఆర్డినేటర్ బి లవకుమర్ తెలిపారు.  శాస్త్రవేత్తలు, ఆఫీస్ సిబ్బంది, రైతుల సహకారం, యువత సహకారం, వివిధ సంస్థల సహకరం వల్ల ఈ ప్రశంసా పత్రాలను పొందామని తెలిపారు.  కేవీకే కార్యక్రమాలను ఇంకా విస్తృత పరచనున్నట్లు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.