గణెళిశ్‌ నిమజ్జనాల్లో అపశృతి

ఓ పోలీస్‌..మరో యువకుడు మృతి
హైదరాబాద్‌,సెప్టెంబర్‌24(జ‌నంసాక్షి): గణెళిశ్‌ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా చిన్న అపశృతి దొర్లింది. వేర్వేరు కారణాలతో ఇద్దరు మృతి చెందారు. అందులో ఒకరు విధోల్లో ఉన్న పోలీస్‌  మృతి చెందారు.
బందోబస్తు కోసం వచ్చిన ఏఎస్‌ఐ గుండె పోటుతో దుర్మరణం చెందాడు. ఈ విషాదకర ఘటన హబీబ్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఆదివారం చోటు చేసుకున్నది. వరంగల్‌ జిల్లా హన్మకొండకు చెందిన నిమ్ర నాయక్‌(55) సిద్ధిపేట జిల్లా  కొమురవెల్లి పోలీస్‌ స్టేషన్‌లో ఏఎస్‌ఐగా విధులు నిర్వర్తిస్తున్నారు. నగరంలో గణెళిశ్‌ ఉత్సవాల బందోబస్తు కోసం వచ్చి  హబీబ్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని మల్లేపల్లి గోకుల్‌నగర్‌ వద్ద ఉన్న వినాయక మండపం వద్ద బందోబస్తులో ఉన్నారు. ఆదివారం తెల్లవారుజామున నిమ్ర నాయక్‌కు గుండె నొప్పి రావడంతో వెంటనే ఇన్‌స్పెక్టర్‌ పరవస్తు మధుకర్‌స్వామి నాంపల్లి కేర్‌ దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ సుమారు 5 గంటల సమయంలో నిమ్రా నాయక్‌ మృతి చెందాడు. మృతదేహానికి ఉస్మానియా మార్చురీలో పోస్టుమార్టం నిర్వహించి సొంతూరికి తరలించారు.  బందోబస్తు విధులకు వచ్చి గుండెపోటుతో ఏఎస్‌ఐ దుర్మరణం చెందడంపై హబీబ్‌నగర్‌ ఇన్‌స్పెక్టర్‌ పరవస్తు మధుకర్‌స్వామి, ఎస్‌ఐలు ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియచేశారు. ఇకపోతే
గణెళిశ్‌ నిమజ్జన ఊరేగింపులో తోటి స్నేహితులు, యువకులతో కలిసి ఉత్సాహంగా డాన్స్‌ చేస్తూ  యువకుడు కుప్పకూలిపోయాడు.  వెంటనే 108లో దవాఖానకు తరలించేలోపు చనిపోయాడు. ఈ ఘటన బోరబండ డివిజన్‌లో చోటుచేసుకున్నది. పెద్దమ్మనగర్‌లో నివాసం ఉండే సతీశ్‌(26)… స్నేహితులతో కలిసి వీధిలో గణెళిశ్‌ మండపాన్ని నెలకొల్పారు.  గణెళిశ్‌ నిమజ్జన ఊరేగింపును ప్రారంభించారు. తోటి స్నేహితులు, యువకులతో కలిసి ఉత్సాహంగా నృత్యం చేస్తుండగా… ఒక్కసారిగా సతీశ్‌ చాతిలో నొప్పి అంటూ కుప్పకూలాడు. 108లో దవాఖానకు తరలించారు. పరీక్షించిన వైద్యులు సతీశ్‌ మృతి చెందాడని నిర్ధారించారు. రంగారెడ్డి జిల్లా మన్నూర్‌ మండలం, దన్వార్‌ గ్రామానికి చెందిన సతీష్‌ బోరబండ డివిజన్‌ పెద్దమ్మనగర్‌లో నివాసం ఉంటున్నాడు.  నిమజ్జన ఊరేగింపులో సతీశ్‌ మృతి చెందగా…మృతదేహాన్ని అతని సొంత ఊరుకు తీసుకెళ్లారు.