గణేష్‌ ఉత్సవాలను స్వార్థ రాజకీయాలకు వాడుకుంటారా?

చిచ్చు పెడితే తిరగబడతాం నందకిషోర్‌
హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 11 (జనంసాక్షి):  ముఖ్యమంత్రి కేసీఆర్‌ పై అరచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోబోమని గోపాల్‌ మహల్‌ తెరాసనేత నందకిషోర్‌ బిలాల్‌ తెలిపారు . బేగం బజార్లో సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి కిషోర్‌ వ్యాస్‌ తెలంగాణ మహిళా కార్యకర్తలతో కలిసి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఢల్లీి పెద్దల నుంచి వచ్చిన ఒత్తిడితోనే తనపై అబిడ్స్‌ పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేశారని తెలిపారు. ఎన్ని కేసులైన ఎదుర్కొంటా కానీ సీఎం కేసీఆర్‌ పై భాజపా నాయకులు అణచిత వ్యాఖ్యలు చేస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. మత రాజకీయాలు చేస్తూ తెలంగాణ ప్రజలను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. తనపై ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని స్పష్టం చేశారు కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లోకి రావాలని వారి సేవలు దేశానికి అవసరమన్నారు. జాతీయ పార్టీ ప్రకటించనున్న సందర్భంగా హర్షం వ్యక్తం చేస్తున్నట్టు నందకిషోర్‌ తెలిపారు.

తాజావార్తలు