గతంలో కబ్జాలు, రౌడీయిజంతో పెత్తనం చేశారు
ఉత్తమ పాలన కోసం మళ్లీ టిఆర్‌ఎస్‌కు పట్టం కట్టాలి
సిద్దిపేట,సెప్టెంబర్28(జనంసాక్షి): గత పాలకుల చేసిన భూ కబ్జాలు, రౌడీయిజంతో ప్రజలు విసిగి వేసారి పోయారని మాజీ ఎమ్మెల్యే రామలింగారెడ్డి తెలిపారు. కొత్తగా వ్యాపారాలు ప్రారంభించిన వారు వారి ఆగడాలకు తాళలేక వ్యాపారాలు మానుకున్నారని చెప్పారు. మహాకూటమి పేరు పెట్టుకొని దొంగ కూటమిగా ఏర్పడి మరొకసారి ప్రజలను వంచించేందుకు ఓట్ల కోసం వస్తున్నాయని అలాంటి వారికి బుద్ది చెప్పాల్సిన బాధ్యత ప్రజలు, టీఆర్‌ఎస్ కార్యకర్తలపై ఉందని అన్నారు. లంగాణ ప్రభుత్వంలో దాదాపు అన్ని ప్రాంతాలు సస్యశ్యామలంగా మారిందని, ఎలాంటి వివాదాలు తలెత్తలేదని గుర్తు చేశారు. రౌడీయిజం, భూ కబ్జాలు చేసిన దాఖలాలు ఎక్కడా కన్పించలేదని ఏ పోలీసుస్టేషన్‌లో కేసులు నమోదు కాలేదని వివరించారు. రాష్ట్రం సుభీక్షంగా ఉండాలంటే రానున్న ఎన్నికల్లోఅటీఆర్‌ఎస్ అభ్యర్థులకు అఖండ మెజారిటీ సాధించి పెట్టాలని స్పష్టం చేశారు. స్థానిక ఎమ్మెల్యేగా ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటూ ఉత్తమ సేవలు అందిస్తూ నియోజకవర్గ ప్రజల సంక్షేమానికి నిరంతరం శ్రమించానని తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని ముంచిన గత పాలకులు ఓట్ల కోసం చీకటి దొంగల అవతారం ఎత్తారని వారి తరిమి కొట్టాలని ప్రజలకు సూచించారు. . సీఎం కేసీఆర్ ప్రభుత్వం పేదల కోసం చేపడుతున్న అభివృద్ది సంక్షేమ పథకాలపై బూత్ లెవల్‌లో ప్రతి ఒక్కరికీ అవగహన కల్పించి పార్టీ పటిష్టతకు కృషి చేయాలన్నారు. అన్ని వర్గాల వారికి ఇంకా అమలు చేయాల్సిన వాటిపై కార్యకర్తలు పార్టీలో చర్చకు తీసుకురావాలన్నారు. మహా కూటమి ఏర్పాటు చేసినా.. అందరూ కలిసి ఎన్ని కుట్రలు, ఎత్తుగడులు వేసినా టీఆర్‌ఎస్‌ను ఓడించడం వారి తరం కాదని పేర్కొన్నారు. ఎన్నికల్లో కార్యకర్తలు అందించే విలువైన సేవలే భవిష్యత్‌లో వారికి మంచి గుర్తింపు తీసుకొస్తాయని చెప్పారు.