గతంలో రైతులను పట్టించుకున్న పాపాన పోలేదు
రైతుబంధు పథకం దేశానికి ఆదర్శం: ముత్తిరెడ్డి
జనగామ,ఏప్రిల్18(జనంసాక్షి): గత ప్రభుత్వాల పాలనలో రైతును పట్టించుకన్నా నాథుడే కరువయ్యారని
ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి న్నారు. రైతుపెట్టబడి పథకం దేశానికే ఆదర్శం కాబోతున్నదని అన్నారు. మొదటి విడుతగా వానకాలం పంటకోసం ఎకరానికి నాలుగువేలు చొప్పున, రెండోవిడుతగా యాసంగి పంటకోసం నాలుగువేలు చొప్పున అందించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించిన విషయాన్ని గుర్తుచేశారు. చెక్కులు, పాస్‌పుస్తకాల పంపిణీకి సంబంధించిన కార్యాచరణ ఖరారాయ్యిందని, తాజా నిర్ణయంతో మే 10న సీఎం కేసీఆర్ చేతుల విూదుగా కార్యక్రమం ప్రారంభం అవుతుందన్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తాము ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని అన్నారు. రైతుల శ్రేయస్సు కోసం సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. ఖరీఫ్ సీజన్ నుంచి ప్రతి ఎకరానికి రూ.8వేలు రైతులకు అందజేస్తూ పెట్టబడి కింద సాయం అందిస్తున్న ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానిదే దక్కిందన్నారు. ఇకపోతే ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు మద్దతు ధర అందుతోందని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ఏ గ్రేడ్ వరి ధాన్యం క్వింటాలుకు రూ.1590, సీ-గ్రేడ్ రకానికి రూ.1550 అందజేస్తున్నట్లు చెప్పారు. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని దళారులను ఆశ్రయించి మోసపోవద్దని సూచించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతీ గ్రామానికి గోదావరి జలాలను అందించడంతో వరి సాగు పెరిగిందని చెప్పారు. కుల వృత్తులను పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు కుల సంఘాలకు అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్నట్లు చెప్పారు. కల్యాణలక్ష్మీ పథకం కింద రూ.75 వేల నుంచి రూ.లక్షా116లకు పెంచి సీఎం కేసీఆర్ పేదల కుటుంబాలకు పెద్దన్న పాత్ర పోశిస్తున్నారని అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్ పథకం క్రమం క్రమంగా విడుతల
వారిగా నిరుపేద కుటుంబాలకు ప్రతి ఒక్కరికీ అందిచేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు చెప్పారు.