గతేడాది హరితహారానికి మంచి స్పందన

అదేస్ఫూర్తితో ముందుకు సాగుతాం

సిద్దిపేట,జూలై13(జ‌నం సాక్షి): గతేడాది హరితహారం కార్యక్రమానికి మంచి స్పందన వచ్చిందని సిద్దిపేట జిల్లా కలెక్టర్‌ వెంకటరామరెడ్డి అన్నారు. ఈ యేడాది కూడా అదేస్ఫూర్తితో ముందుకు సాగుతామని అన్నారు. చేపట్టిన ప్రతిచోటా ప్రజలు భాగస్వాములు అయ్యారని అన్నారు. జిల్లా రైతులకు సాగునీటిని అందించేందుకు కోసం కరీంనగర్‌ జిల్లాలోని మిడ్‌మానేరు నుంచి కాలువలు తవ్వుతున్నామని, ఈ పనులు ఇప్పటికే పూర్తికావొస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జలాశయ నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభమవుతాన్నారు.మామిడ్యాల, బైలంపూర్‌, తానేదార్‌పల్లి గ్రామాలకు చెందిన రైతులు స్వచ్ఛందంగా తరలివచ్చి వారి భూములు రిజిస్టేష్రన్లు చేసి ప్రభుత్వానికి అప్పగిస్తున్నారన్నారు. ఈ పక్రియ సవ్యంగా జరిగేందుకు ప్రభుత్వపరంగా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఇకపోతేజిల్లాలో మిషన్‌ భగీరథ పనులు చురకుగా సాగుతున్నాయి. ఈ మేరకు పైపు లైన్‌ పనులు పూర్తి కావస్తున్నాయి. ప్రభుత్వం విడుదల చేసిన నిధులతో మిషన్‌ భగీరథ పనులు కొనసాగుతున్నాయి. డిసెంబర్‌ నెలాఖరులోగా మిషన్‌ భగీరథ పనులు పూర్తి చేస్తామన్న ధీమాలో అధికారులు ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా హల్దీ, సింగురు ప్రాజెక్టులు నీటిని అందించి లక్ష ఎకరాలకు సాగు నీటిని అందించేందుకు సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి నిరంతరంగా కరెంటును అన్నారు.