గద్దర్‌కు మిద్దె రాములు పురస్కారం

హైదరాబాద్‌: ప్రాచీన జానపద కథాగాన కళారూపం ‘ ఒగ్గుకథ’కు నూతన జవసత్వాలను సమకూర్చి, కనీవినీ ఎరగని ప్రజాదరణను తీసుకువచ్చిన విఖ్యాత కళాకారుడు మిద్దె రాములు పేరిట నెలకొల్పిన పురస్కారానికి ప్రజాగాయకుడు గద్దర్‌ ఎంపికయ్యారు. ఈ నెల 25న కరీంనగర్‌ జిల్లా వేములవాడలో ఈ సత్కారోత్సవాన్ని నిర్వహించనున్నట్లు మిద్దె రాములు ట్రస్ట్‌ అధ్యక్షుడు మిద్దె పరుశురాం గురువారం ఒక ప్రకటనలో తెలియజేశారు. గద్దర్‌కు మిద్దె రాములు పురస్కారంతో పాటు ఆకాశవాణి కార్యక్షికమ నిర్వాహకులు సుమనస్సతిడిని కూడా ఈ ఉత్సవంలో సన్నానించనున్నట్లు పేర్కొన్నారు. వేములవాడ సినారె కళామండపంలో సత్కారోత్సవం జరగనుంది. కార్యక్షికమంలో ఎంపీ పొన్నం ప్రభాకర్‌, రాష్ట్ర ప్రభుత్వ సాంస్కక్షుతిక సలహాదారు కేవీ రమణాచారి తదితరులు పాల్గొంటారు.