గద్వాలలో ఘనంగా అమరుడు పులిమామిడి మద్దిలేటి 9వ వర్ధంతి.

గద్వాలలో ఘనంగా అమరుడు పులిమామిడి మద్దిలేటి 9వ వర్ధంతి.

గద్వాల నడిగడ్డ, అక్టోబర్ 14 జనం సాక్షి.
జోగులాంబ గద్వాల జిల్లా లోని 2 వ రైల్వే గేటు దగ్గర శనివారము పులిమామిడి మద్దిలేటి స్థూపం వద్ద ఆయన 9వ వర్ధంతి ని తెలంగాణ ప్రజా ఫ్రంట్ అధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. టీపీఎఫ్ రాష్ట్ర కో కన్వీనర్ శంకర ప్రభాకర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో తెలంగాణ రైతాంగ సమితి రాష్ట్ర అధ్యక్షుడు జక్కుల వెంకటయ్య మాట్లాడుతూ మద్దిలేటి మళ్లీ దిశ తెలంగాణ ఉద్యమంలో విస్తృతంగా పనిచేసి భౌహోగోళిక తెలంగాణ కాదు, ప్రజాస్వామ్యక తెలంగాణ కావాలని ఆనాడే పత్తి రైతులకు అన్యాయం జరుగుతుందని జిల్లాలోని ఎర్రవల్లి చౌరస్తాలో పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించి, లాఠీ దెబ్బలకు భయపడక జైలు జీవితం కూడా గడిపిన ఆయన ఆశయాలను కొనసాగించాలని అన్నారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు, కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు ఆయన చేసిన సేవలను కొనియాడారు. ప్రభుత్వ ఉద్యోగం చేస్తు వీలైనప్పుడల్లా అంబేద్కర్ యువజన సంఘం లో పనిచేస్తూ, తెలంగాణ జన సభ, ఏపీ సి ఎల్సి సి, ఏపీటీఎఫ్ లలో కూడా చురుకైన వ్యక్తిగా పనిచేయడం వల్ల తెలంగాణ ప్రజా ఫ్రంట్ కు ఇలాంటి వ్యక్తి అవసరమని అప్పుడు తెలంగాణ ప్రజా ఫ్రంట్ లో కార్యకర్తగా చేరి రాష్ట్ర అధ్యక్షుడిగా తెలంగాణకు ఎనలేని సేవ చేశారని, ప్రజాస్వామ్య తెలంగాణ రావాలని ఆయన కోరుకునేవాడని అందరం కలిసికట్టుగా ఆయన ఆశయాలను కొనసాగించాలని వక్తలు అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతన్న సమితి రాష్ట్ర ప్రధాకార్యదర్శి గోపాల్, పౌర హక్కుల సంఘం మహబూబ్ నగర్ ఉమ్మదిజిల్లా అధ్యక్షుడు శుభాన్, కే ఎన్ పి ఎస్ జిల్లా అధ్యక్షులు రవికుమార్, జర్నలిస్ట్ ఇస్మాయిల్, మద్దిలేటి కూతురు లలిత, బావ భాస్కర్, ఎల్కూరు మహేష్ మొదలగు వారు పాల్గొని నివాళలర్పించారు.